చలికాలంలో బొప్పాయి పండు తింటే ఏం జరుగుతుంది..?

First Published | Jan 16, 2024, 2:31 PM IST

బొప్పాయి పండు తింటే.. ఆ సమస్య రాదు. బొప్పాయి తింటే.. చర్మం అందంగా మారుతుంది. మెరుస్తూ కనపడుతుంది.
 

papaya

ఈ చలికాలంలో చలి విపరీతంగా పెరిగిపోతోంది. చలి పెరిగినప్పుుడు ఆ చలి తట్టుకోవడం అంత సులవేమీ కాదు. జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ లాంటి చాలా సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే.. ఆరోగ్యకరమైన ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అలాంటి ఆహారంలో బొప్పాయి కూడా ఒకటి. మనం ఈ చలికాలంలో బొప్పాయి పండును కచ్చితంగా తినాలి. అయితే.. అలా తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు  చూద్దాం..

1. బొప్పాయి పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల ఇమ్యునిటీ సిస్టమ్ బలపడుతుంది. బొప్పాయి పండు రెగ్యులర్ గా తినడం వల్ల..  జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.


2.ఇక ఎక్కువగా చలికాలంలో పని చేయాలని అనిపించదు. దీంతో.. వర్కౌట్స్ పై పెద్దగా ఫోకస్ పెట్టం. శరీరానికి కష్టపెట్టకపోవడంతో.. తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణమవ్వదు. కానీ.. బొప్పాయి పండు తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. బ్లోటింగ్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
 


3. బొప్పాయి పండు తినడం వల్ల.. చర్మ ఆరోగ్యం పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ బొప్పాయి పండులో విటమిన్ ఎ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో.. మన చర్మం పొడిబారడం, చర్మం నిస్తేజంగా మారడం, హైడ్రేటింగ్ సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ.. బొప్పాయి పండు తింటే.. ఆ సమస్య రాదు. బొప్పాయి తింటే.. చర్మం అందంగా మారుతుంది. మెరుస్తూ కనపడుతుంది.

4.కేవలం, అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ బొప్పాయి పండు కీలకంగా పని చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కాపాడటంలో బొప్పాయి ప్రధాన పాత్ర పోషిస్తుంది. గుండెకు రక్త సరఫరా సరిగా జరిగేలా సహాయపడుతుంది.


5.ఇవి మాత్రమే కాదు...  బరువును కంట్రోల్ చేయడంలోనూ  బొప్పాయి కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే  ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పండు తినడం వల్ల, కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి.. ఇతర జంక్ ఫుడ్, బరువు పెంచే ఆహారం తీసుకోలేం. దీని వల్ల.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

6.అంతేకాదు.. బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి.. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి.
 

papaya

7.ఈ బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో సీజనల్ ఎలిమెంట్స్  శరీరానికి అవసరమైతూ.. వాటిని అందించడంలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది.


8.శరీరాన్ని హైడ్రేటెడ్ గా  ఉంచడంలోనూ బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. సహజంగా మన మూడ్ ని  మంచిగా చేస్తుంది. అంటే.. డల్ గా ఉండకుండా.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా సహాయపడుతుంది.
 

Latest Videos

click me!