ఈ చలికాలంలో చాలా రకాల ఆహారాలు తినాలని మన పెద్దలు, వైద్యులు చెబుతుంటారు. ఏ ఆహారాలు తింటే.. మన ఆరోగ్యం బాగుంటుందో ఇప్పటికే అందరికీ ఓ అవగాహన ఉండే ఉంటుంది. అలా మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాల్లో ముల్లంగి ముందు ఉంటుంది. అందులోనూ ఈ వింటర్ లో మనకు ముల్లంగి చాలా పుష్కలంగా లభిస్తుంది. ముల్లంగిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ముల్లంగిలో విటమిన్ ఎ, బి , సి, ప్రోటీన్, కాల్షియం , ఐరన్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది చలికాలంలో దీన్ని తినడానికి ఇష్టపడతారు, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.