ఈ రోజుల్లో పిల్లలకు చాలా మందికి స్నాక్స్ అంటే.. పిజ్జాలు, బర్గర్లు లాంటివే గుర్తుకువస్తూ ఉంటాయి. కానీ... ఒకప్పుడు ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు.. కొబ్బరి లడ్డు, పల్లీ చెక్క, నువ్వుల ఉండ లాంటివి చేసి రెడీగా ఉంచేవారు. వాటినే తినేవాళ్లు.. అందుకే ఆ కాలం వాళ్లు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిన వాళ్లంతా చాలా తొందరగా అనారోగ్యానికి గురౌతున్నారు. అయితే... ఇప్పటి నుంచి అయినా.. రోజూ ఒక కొబ్బరి లడ్డూని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.