ఈ ఫుడ్స్ రాత్రి 8 తర్వాత తినొచ్చు తెలుసా?

First Published | Feb 16, 2024, 3:55 PM IST

రాత్రి తినడం వల్ల.. వాటిలోని న్యూట్రిషన్స్ పోతాయేమో, ఒంట్లో కొవ్వు పెరుగుతుందేమో అని కూడా భయపడాల్సిన పనిలేదు. మరి... రాత్రి 8 తర్వాత తినదగిన ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

మీరు వినే ఉంటారు.. ఆరోగ్యంగా ఉండాలి అంటే..రాత్రి భోజనం తొందరగా పూర్తి చేయాలి అని. మరీ ముఖ్యంగా  రాత్రి 8లోపు భోజనం పూర్తి చేయాలి అని అంటారు. ఇది నిజమేనేమో. కానీ.. కొన్ని రకాల ఆహారాలను సరిగా తీసుకుంటే.. రాత్రిపూట కూడా తినొచ్చు. మరీ ముఖ్యంగా రాత్రి8 తర్వాత తినొచ్చు. రాత్రి తినడం వల్ల.. వాటిలోని న్యూట్రిషన్స్ పోతాయేమో, ఒంట్లో కొవ్వు పెరుగుతుందేమో అని కూడా భయపడాల్సిన పనిలేదు. మరి... రాత్రి 8 తర్వాత తినదగిన ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

1.గ్రీక్ యోగర్ట్..
ఈ గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట స్నాక్స్ గా తినడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికీ, మనకు కావాల్సిన కాల్షియం అందించడంలోనూ కీలకంగా పని చేస్తుంది.


2.చెర్రీస్..
చెర్రీస్ లో  మెలాటోనిన్ పుష్కలంగా ఉంటుంది. రాత్రిపూట ఈ చెర్రీస్ తినడం వల్ల  మంచి నిద్ర కూడా వస్తుంది. మంచి నిద్రకు కావాల్సిన హార్మోన్ ని  ఈ చెర్రీస్ తినడం వల్ల విడుదలౌతాయి. కాబట్టి... హ్యపీగా వీటిని రాత్రిపూట తినొచ్చు. మంచిగా ఒక చిన్న గిన్నె చెర్రీస్ ని హ్యాపీగా తినొచ్చు.

badam


3.బాదంపప్పు..

చాలా మంది బాదం పప్పును ఉదయం మాత్రమే తినాలి అనుకుంటూ ఉంటారు. కానీ.. ఈ బాదం పప్పును రాత్రిపూట హ్యాపీగా తినొచ్చు. దీనిలో న్యూట్రిషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మజిల్ రిలాక్సేషన్ కి సహాయపడుతుంది. 
 

4.కివి..
కివీస్ లో  విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో సెరోటోనిన్ కూడా ఉంటుంది.  మంచి రిలాక్సేషన్ అందిస్తుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.. హెవీ ఫీలింగ్ కూడా రాదు.

5.కాటేజ్ చీజ్..
చాలా మంది చీజ్ చాలా హెవీ ఫుడ్ అని ఫీలౌతూ ఉంటారు. కానీ  ఈ చీజ్ ని కూడా రాత్రిపూట హ్యాపీగా తినొచ్చు. ఈ చీజ్ లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బెడ్ టైమ్ కి బెస్ట్ ఫుడ్ గా చెప్పొచ్చ.
 

6.సెరెల్స్..

అన్ని రకాల సెరెల్స్ వేటినైనా మనం రాత్రిపూట తినొచ్చు. అది కూడా పాలతో తీసుకోవచ్చు. వీటిలో కార్బో హైడ్రేట్స్  పుష్కలంగా ఉంటాయి. తక్షణ ఎనర్జీ ని అందిస్తాయి.

7.డార్క్ చాక్లెట్..
 డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రాత్రిపూట కూడా  హ్యాపీగా తినొచ్చు. రాత్రిపూట స్వీట్ క్రేవింగ్స్ తినాలనే కోరిక తీరుస్తుంది. యాంటీ ఆక్సీడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

banana

8.అరటిపండ్లు..
అరటిపండ్లను కూడా మనం  రాత్రిపూట పుష్కలంగా  తినొచ్చు. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.  మజిల్ రిలాక్సేషన్ కి సహాయపడుతుంది. సహజంగా స్వీట్ ఉంటుంది కాబట్టి...  స్వీట్ తినాలనే కోరికను  దీనితో కంట్రోల్ చేసుకోవచ్చు.
 

Latest Videos

click me!