healthy vegetables
తాజా కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది పచ్చికూరగాయలను కూడా తింటున్నారు. కానీ కొన్ని కూరగాయలను పచ్చిగా అస్సలే తినేయకూడదు. ఎందుకంటే ఇవి మీ జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. అలాగే పోషక శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇంతకీ ఎలాంటి కూరగాయలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Potatoes
బంగాళదుంపలు
బంగాళాదుంపలతో తీరొక్క కూరలను చేసుకుని తింటుంటాం. కానీ వీటిని పచ్చిగా అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బంగాళాదుంపలలో నిరోధక పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది. అంతేకాదు పచ్చి బంగాళాదుంపల్లో సోలనిన్ అనే సహజ విషం ఉంటుంది. ఇది వికారం, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఆలుగడ్డలను ఎప్పుడూ కూడా ఉడకబెట్టి, బేకింగ్ లేదా కాల్చడం వంటి పద్దతుల్లోనే తినాలి. ఇలా వండటం వల్ల ఈ సమ్మేళనాలను విచ్ఛిన్నం అవుతాయి.
వంకాయలు
వంకాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయినప్పటికీ.. వీటిని పచ్చిగా అసలే తినకూడదు. ఎందుకంటే వాటి చేదు రుచి, జీర్ణ సమస్యలను కలిగించే సోలాసోనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందుకే వీటిని పచ్చిగా తినకూడదని అంటుంటారు. వంకాయలను వండటం వల్ల వాటి చేదు తొలగిపోవడమే కాకుండా వాటి రుచి, పోషక విలువలు కూడా పెరుగుతాయి. వంకాయలను గ్రిల్ చేయడం, వేయించి తినొచ్చు.
Tomatoes
టమాటాలు
టమాటాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయినప్పటికీ వీటిని వండినప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. పచ్చి టమాటాలలో టోమాటిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అలాగే పోషక శోషణకు ఆటంకం కలిగిస్తుంది. టమాటాలను వండటం వల్ల వాటి ఆకృతి మారుతుంది. అలాగే టోమాటిన్ స్థాయిలను తగ్గిస్తుంది.
Image: Freepik
బచ్చలికూర
తాజా సలాడ్లలో బచ్చలికూరను తప్పకుండా చేర్చుతారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని. కానీ పచ్చి బచ్చలికూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాల్షియం, ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. బచ్చలికూరను వండటం వల్ల ఆక్సాలిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది. అలాగే దాని పోషకాలు కూడా పెరుగుతాయి. బచ్చలికూరను ఆవిరి చేయడం లేదా వేయించడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మన శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.