ఎవరు చపాతీలను తినకూడదో తెలుసా?

First Published | Oct 11, 2024, 11:24 AM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలనే ఎక్కువగా తింటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం చపాతీలను అస్సలు తినకూడదు. 

అన్నం, మైదా పిండి కంటే గోధుమలే ఆరోగ్యానికి మంచివి. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, రాత్రి భోజనంలో చపాతీలనే ఎక్కువగా తింటుంటారు.

గోధుమ పిండి చపాతీలు ఆరోగ్యనికి మంచివే అయినా.. కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం చపాతీలను తినకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రక్తంలో చక్కెర స్థాయి

ఈ రోజుల్లో చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. అయితే వీళ్లకు అన్నం మంచిది కాదు.ఎందుకంటే రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. కాబట్టి మధుమేహులు అన్నానికి బదులుగా గోధుమ చపాతీలను తింటుంటారు.

కానీ డయాబెటీస్ ఉన్నవారు గోధుమ చపాతీలను కూడా తినకూడదు. ఎందుకంటే దీనిలో అమిలోపెక్టిన్ అనే కార్బోహైడ్రేట్, స్టార్చ్ అణువులు ఉంటాయి. అందుకే రక్తంతో చక్కెర స్థాయిలు ఎక్కువగ ఉన్నవారు చపాతీలను తక్కువగా తినాలి. ఎందుకంటే ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 
 


ఉదరకుహర వ్యాధి

ఉదరకుహర వ్యాధి ఉన్నవారు కూడా గోధుమ చపాతీలను అస్సలు తినకూడదు. ఎందుకంటే గోధుమల్లో గ్లూటెన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఉదరకుహర వ్యాధికి దారితీస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీకు ఈ సమస్య ఉంటే.. మరింత ఎక్కువ అవుతుంది. దీనివల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గ్లూటెన్ అలెర్జీ ఉంటే గోధుమ చపాతీలను తినకండి. 

శక్తి లేకపోవడం

బాగా అలసగా ఉన్నవారు కూడా గోధుమ చపాతీలను తినకూడదు. ఎందుకంటే గోధుమల్లో ఉండే కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీంతో మీకు అలసటగా, బద్దకంగా అనిపిస్తుంది. నిజానికి చపాతీలు మీ శక్తిని తగ్గిస్తాయి. అలాగే మీకు పదేపదే ఆకలి అయ్యేలా చేస్తాయి. అందుకే ఎనర్జీ తక్కువగా ఉన్నవారు చపాతీలను తినకపోవడమే మంచిది. 
 

థైరాయిడ్

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా చపాతీలను తినకూడదు. ఎందుకంటే గోధుమలలో ఎక్కువ మొత్తంలో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులొచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఉన్న సమస్యను మరింత పెద్దగా చేస్తుంది. అందుకే థైరాయిడ్ ఉన్నవారు  గోధుమ చపాతీలకు దూరంగా ఉండాలి. 

బరువు పెరగడం

చాలా మంది బరువు తగ్గాలని అన్నం మానేసి చపాతీలనే తింటుంటారు. కానీ చపాతీలను ఎక్కువగా తింటే కూడా బరువు పెరుగుతారు తెలుసా? గోధుమల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ వల్ల మీ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో మీరు చాలా సులువుగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు, బరువు పెరగకూడదనుకుంటున్నవారు చపాతీలను తినకపోవడమే మంచిది. 
 

జీర్ణ సమస్యలు

చాలా మంది చపాతీలను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ చపాతీలను ఎక్కువగా తింటే మీకు గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే గోధుమలోని గ్లూటెన్ పేగుల్లో మంటను కలిగిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. 
 

Latest Videos

click me!