Parotta: పరోటా రోజూ తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

Published : Feb 18, 2025, 11:45 AM IST

చపాతీ, పూరీ ని ఎంత ఇష్టంగా తింటారో.. పరోటాని కూడా అంతే ఇష్టంగా తినేవాళ్లు చాలా మంది ఉన్నారు. మరి, ఈ పరోటా రెగ్యులర్ గా తినడం మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..    

PREV
15
Parotta: పరోటా రోజూ తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదేనా?

పరోటా చాలా మందికి ఇష్టమైన ఆహారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.  పూరీ, చపాతీలను ఎంత ఇష్టంగా తింటారో..  ఈ పరోటాలను కూడా అంతే ఇష్టంగా తినేవాళ్లు ఉన్నారు. ముఖ్యంగా ఆలూ కుర్మా, చికెన్ గ్రేవీతో కలిపి తింటే.. దాని రుచి డబుల్ అవుతుంది. కానీ.. పరోటాలను తినడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం....

 

 

25

పరోటా రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ.. దాదాపు ఈ పరోటాలను మైదా పిండితోనే తయారు చేస్తారు. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థను చాలా ఎక్కువగా దెబ్బతీస్తాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కూడా కాదు. పరోటా జీర్ణం చేయడానికి జీర్ణాశయ అవయవాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి.

35

మీకు తెలుసా.. గోధుమ నుండి మైదాను వేరు చేయడానికి, 'బెంజాయిల్ పెరాక్సైడ్' అనే రసాయనం ఉపయోగిస్తారు. కానీ, ఇది మన జుట్టుకు వేసే రంగులో కలుపుతారని మనలో చాలా మందికి తెలియదు. అంతే.. తెలీకుండానే స్లో పాయిజన్ లో కెమికల్స్ మనం తీసుకుంటున్నాం..

45

అంతేకాకుండా, మైదాలో ఫైబర్ అస్సలు ఉండదు. కాబట్టి, పరోటా ఎక్కువగా తినేవారికి మలబద్ధకం సమస్య వస్తుంది. ముఖ్యంగా, రాత్రిపూట పరోటా తినడం మరణాన్ని వెతుక్కు వెళ్లడంతో సమానం. పరోటా రుచిని పెంచడానికి అందులో అజినమోటో కలుపుతారు. అంతేకాకుండా, పరోటాకు పోసే సాల్నాలో కూడా ఇదే కలుపుతారట. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.

 

55

మైదా పిండిని చైనా, ఇంగ్లాండ్ వంటి అనేక దేశాలు నిషేధించాయి. అలాగే, పరోటా మాత్రమే కాదు, మైదా పిండితో తయారు చేసే ఏ ఆహారాలు కూడా ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి.

 

click me!

Recommended Stories