expiry date
మనం తినే ప్రతి ఫుడ్ కీ ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం అయితే.. మనకు ఎన్ని రోజుల వరకు వాడొచ్చు అనే ఒక అవగాహన ఉంటుంది. అదే బయట కొన్నవి అయితే... ప్యాకేట్ మీద.. క్లియర్ గా ఎక్స్ పైరీ డేట్ వేసి ఉంచుతారు. అది చూసుకొనే దాదాపు ఆహారం తింటూ ఉంటారు. కానీ... కొందరు పొరపాటున డేట్ చూసుకోకుండా తిన్న సందర్భాలు కూడా లేకపోలేదు. కొన్ని సార్లు కొందరేమో... డేట్ అయిపోయి రెండు రోజులే అయ్యింది కదా.. మనం ఫ్రిడ్జ్ లోనే పెట్టుకున్నాం కదా తింటే ఏమౌతుంది అని తినేస్తూ ఉంటారు. అసలు డేట్ అయిపోయిన తర్వాత ఫుడ్స్ తినొచ్చా? పొరపాటున తింటే ఏమౌతుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఓసారి చూద్దాం..
ఫుడ్ డేట్ ఎక్స్ పైరీ అయినప్పుడు అందులో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అఅందులో రసాయన మార్పుల కారణంగా ఆ ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఫుడ్ డేట్ అయిపోయిన తర్వాత... సాల్మనెల్లా, ఇ. కోలి లేదా లిస్టేరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా అందులో తయారౌతుంది. మనం తెలీక దానిని తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
గడువు ముగిసిన ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు...
1. ఆహార విషం గడువు ముగిసిన ఆహారంలో బాక్టీరియా ఉంటుంది. దాని వల్ల దానిని తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం , ఒక్కోసారి అవయవాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.
2.ఒక్కోసారి గడువు దాటిన ఆహారం తినడం వల్ల.. ఆ ఫుడ్ విషంగా మారే ప్రమాదం ఉంది. ఇది.. అల్జెరీలు, శ్వాసకోస సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
3.గడువు ముగిసిన ఆహారం.. రుచి, రంగు, ఆకృతి మారిపోతాయి. దుర్వాసన కూడా వస్తుంది. దీని అర్థం.. ఆహారం చెడిపోయిందని అర్థం. ఇది తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
4.ఇక కొన్ని ఆహారాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని వాటిలో బిస్పినాల్ లేదంటే థాలేట్స్ వంటి హానికరమైన రసాయనాలు కలుపుతారు. అవి ఎక్కువ రోజులు ఆ ఫుడ్ ని అలానే ఉంచితే.. ఆ రసాయనాలు ఫుడ్ లో కలిసిపోతాయి. ఆ ఆహారం తినడం వల్ల ఆ రసాయనాలు మన శరీరంలోకి కూడా చేరి ఆరోగ్యం పాడు చేసే అవకాశం ఉంది.
పొరపాటున తెలీక డేట్ గడిచిన ఆహారం తిన్నప్పుడు... ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు తీసుకోవాలి.
ప్రశాంతంగా ఉండాలి.. అయ్యో ఎక్స్ పైర్ అయిపోయిన ఫుడ్ తిన్నాం అని ముందు కంగారుపడకూడదు. భయపడితే.. మరింత ఎక్కువ ఆందోళనకు గురౌతారు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండి.. లోతుగా శ్వాస తీసుకోవాలి. మీకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయో గమనించాలి. ఆ లక్షణాల ఆధారంగా చికిత్స అందించవచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ లేదా అలెర్జీ ప్రతిచర్యలకు సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం మిమ్మల్ని మీరు పర్యవేక్షించండి. లక్షణాలు వికారం, వాంతులు, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి లేదా మైకము కలిగి ఉండవచ్చు. వాటికి తగిన చికిత్స తీసుకోవచ్చు.
అంతేకాదు.. ఇలాంటి ఆహారం తిన్నప్పుడు వెంటనే నీరు ఎక్కువగా తాగాలి. నీరు తాగినప్పుడు ఆ నీటి సహాయంతో బాడీలోని విషపు ఆహారాన్ని బయటకు పంపేయవచ్చు. ఎక్కువగా వాటర్ తాగడం ఉత్తమం. లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.