పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినే చైనీస్ స్పెషల్ స్ప్రింగ్ రోల్స్. నూడుల్స్, క్యారెట్స్, క్యాప్సికమ్ లాంటి కూరగాయలతో చేసే ఈ స్నాక్ ను ఈజీగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.
undefined
బైటికి క్రిస్పీగా, నోట్లో వేసుకోగానే అద్భుతమైన రుచితో కరిగిపోయే ఈ చిరుతిండిని పిల్లలు బాగా ఇష్టపడతారు. అనుకోకుండా వచ్చే గెస్ట్ లకోసం ఎక్కువ కష్టపడకుండా టక్కున చేయగలిగే స్నాక్ ఐటమ్ ఇది.
undefined
అంతేకాదు కూరగాయలు ఎక్కువగా తినని పిల్లలకోసం.. అన్ని రకాల కూరగాయల్లోని పోషకాలు వారికి అందేలా చేసే వంటకం ఇది. చక్కటి ఆరోగ్యకరమైన, పౌష్టికాహరం. కిట్టీపార్టీలు, బర్త్ డేలు, చిన్న చిన్న గెట్ టు గెదర్ లలో సులభంగా చేసుకోగలిగినచైనీస్ రెసిపీ ఇది. ఇది స్టార్టప్ లా కూడా తినడానికి బాగుంటుంది.

దీన్నెలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వెజ్ నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
undefined
ఆరుగురు తినడానికి సరిపోయే కొలతలు...తాజా నూడుల్స్ 2 కప్పులు, టమోటా కెచప్ 3 టీస్పూన్లు, సన్ ఫ్లవర్ ఆయిల్ 2 కప్పులు, క్యాప్సికమ్ 4 టీస్పూన్లు, మైదా 2 కప్పులు
undefined
నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే విధానం..స్టేజ్ 1మొదట స్ప్రింగ్ రోల్స్ బైటి కవర్ కోసం.. ఒక గిన్నెలో మైదా తీసుకుని దీంట్లో ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి.
undefined
స్టేజ్ 2ఇలా కలుపుకున్నాక దీనికి కొద్దికొద్దిగా నీరు చేర్చుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మధ్యలో ఉండలు లేకుండా, పిండి మృధువుగా ఉండేలా చూసుకోవాలి. తరువాత పిండిని చిన్న ముద్దలుగా చేసి వాటిని పూరీల్లా వత్తుకోవాలి.
undefined
స్టేజ్ 3ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎక్కువ మంట మీద వేడి చేయాలి. నూనె వేడెక్కాక క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను వేసి ఒకట్రెండు నిమిషాల పాటు వేయించాలి. దీంట్లో ఉప్పు, సోయా, మిరియాలు వేసి కిందికి, మీదికి కలపాలి.
undefined
స్టేజ్ 4దీంట్లోనే నీళ్లు పోసి నూడుల్స్ కలపాలి. వీటిని మృదువు అయ్యేదాకా ఉడికించాలి. తరువాత దీనికి టొమాటో సాస్, నూడుల్స్ మసాలా వేసి చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత స్టౌ ఆఫ్ చేయాలి.

స్టేజ్ 5ఇప్పుడు ముందు తయారుచేసుకున్న మైదాపిండి పూరీలలో ఒకట్రెండు చెంచాల ఈ మిశ్రమాన్ని వేసి రోల్స్ లా చుట్టాలి. కుడి, ఎడమలవైపు ఒక ఇంచు లోపలికి ఉండేలా మడవాలి.
undefined
స్టేజ్ 6నూనెలో వేసినప్పుడు మిశ్రమం బైటికి రాకుండా చివర్లు బాగా మూయాలి. అన్ని రోల్స్ ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
undefined
స్టేజ్ 7దళసరి మూకుడును తీసుకుని దీంట్లో నూనె వేడి చేసి, ఈ రోల్స్ ను డీప్ ఫ్రై చేసుకోవాలి. బంగారు వర్ణం వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆ తరువాత వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే వేడి వేడి నూడుల్స్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని సాస్ తో గానీ, పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే బాగుంటుంది.
undefined