లేడీ సూపర్ స్టార్ బ్రేక్ ఫాస్ట్ లో ఏం తీసుకుంటారో తెలుసా?

First Published | Sep 19, 2023, 3:06 PM IST

నయన్ వయసు పెరుగుతుంటే, అందం కూడా పెరుగుతోంది. అయితే, అంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నయన్ ఏం  చేస్తుంది..? ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం... 

సౌత్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నయనతార. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అంతే కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది బ్యూటీ.  అంతే కాదు హీరోయిన్ల కెరీర్ టైమ్ మహా అయితే 30.. అది దాటితే.. 35 వరకూ నెట్టుకుని వచ్చేవారు ఉన్నారు. కాని 40 ఏళ్ళు వస్తున్నా.. హీరోయిన్ గా అదే డిమాండ్ తో దూసుకుపోతోంది నయనతార. 

లేడీ సూపర్ స్టార్ నయనతార.. వరస సినిమాలతో దూసుకుపోతోంది. సినిమా కెరిర్ ప్రారంభించిన కొత్తలో ఏ దూకుడుతో ఉందో.. ఇప్పుడు కూడా అంతే దూకుడుగా ఉంది. వరసగా సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.ఇక పర్సనల్ లైప్ లోనూ.. ఆమె డైరెక్టర్  విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా కూడా మారారు.
 

Latest Videos


ఆమె హీరోయిన్ గా నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీలో ఆమె షారూక్ సరసన నటించింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది కావడం విశేషం. 

నయన్ వయసు పెరుగుతుంటే, అందం కూడా పెరుగుతోంది. అయితే, అంత అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నయన్ ఏం  చేస్తుంది..? ఎలాంటి ఆహారం తీసుకుంటుందో ఓసారి చూద్దాం... నయన్  న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుందట. ఫైబర్ ఎక్కువగా ఉండేలా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే  ఆహారాన్ని ఎంచుకుంటుందట.
 

నయనతారకు కొబ్బరి స్మూతీ అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ స్మూతీనే నయన్ తీసుకుంటుందట. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..
 

కావాల్సినవి.. రెండు కప్పుల కొబ్బరి నీళ్లు,  ఒక కప్పు టెండర్ కోకోనట్,  అరకప్పు కొబ్బరి పాలు, రుచికి సరిపడా పంచదార, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు యాలకులపొడి. 
 

తయారీ విధానం.. ఒక బ్లెండర్ జార్ లో కొబ్బరి నీళ్లు, టెంబర్ కొబ్బరి వేయాలి. దీనిలో కొబ్బరి పాలు, పంచదార వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. దీనిలోనే యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే బాగా కలిపితే సరిపోతుంది. దీని రుచి చాలా బాగుంటుంది.

కొబ్బరిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్బో హైడ్రేట్స్  చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. యవ్వనంగా కనిపించడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ సి కూడా లభిస్తుంది.
 

click me!