చెరకు రసం మీ కాలేయాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది కామెర్లను సహజంగా తగ్గిస్తుంది. వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. చెరకు రసంలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని సంక్రమణ నుంచి రక్షిస్తాయి. అలాగే బిలిరుబిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెరకులోని సుక్రోజ్ మీ శరీరానికి కావాల్సిన సరైన మొత్తంలో శక్తిని ఇస్తుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలలో ముఖ్యమైనది చెరకులోని గ్లైకోలిక్ ఆమ్లం. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఒక గ్లాసు చెరకు రసంలో అల్లాన్ని కలిపి తాగితే గర్భిణులకు మార్నింగ్ సిక్ నెస్ తగ్గుతుంది. చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా చెరకు రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఖనిజ లోపం కూడా పోతుంది. చెరకు రసంలో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. చెరకు రసాన్ని తీసిన వెంటనే తాగాలి. ఎందుకంటే ఇది 15 నిమిషాల్లో ఆక్సీకరణం చెందుతుంది.