బొటానికల్ గా... కీరదోసను పండుగా చెబుతారట. ఎందుకంటే... ఇది కీరదోస మొక్క నుంచి పువ్వు వచ్చి ఆ తర్వాత అది కాయగా మారుతుంది. అంతేకాదు.. దానికి గింజలు కూడా ఉంటాయి. ఆ గింజలు కూడా.. పుచ్చకాయ, ఖర్బుజా గింజల్లా కనిపిస్తూ ఉంటాయి.
కానీ.. అందరూ దీని టేస్టు కారణంగా, స్వీట్లలలో వాడరు, సలాడ్స్, సూప్స్ లో వాడతారు కాబట్టి దీనిని కూరగాయ అనుకుంటూ ఉంటారు. ఇక ఈ కీరదోసలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. బాడీని ఎప్పుడూ కూల్ గా ఉంచుతుంది. ముఖ్యంగా... ఎండాకాలంలో.. బాడీని మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి, సహాయం చేస్తుంది.