రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం ఎలా తినాలో తెలుసా?

First Published | Oct 14, 2024, 3:19 PM IST

చాలాసార్లు రాత్రిపూట అన్నం మిగిలిపోతుంటుంది. ఈ అన్నాన్ని కొంతమంది పోపు వేసి తింటే.. మరికొంతమంది పులిహోర చేసి తింటుంటారు. అయితే రాత్రి మిగిలిన అన్నం ఉదయానికల్లా కాస్త  గట్టిపడుతుంటుంది. అస్సలు తినాలనిపించదు. కానీ మీరు ఒకటి చేస్తే మాత్రం అన్నం సాఫ్ట్ గా అవుతుంది. 

అప్పుడప్పుడు రాత్రిపూట అన్నం మిగలడం చాలా కామన్.  ఇలా మిగిలిపోయిన అన్నం వేస్ట్ ఏం కాదు. కానీ దీన్ని వేడి చేస్తే మరింత గట్టిగా అవుతుంది. దీనివల్ల అస్సలు తినాలనిపించదు. అంతేకాకుండా దీని టేస్ట్ కూడా పోతుంది. 

అయితే కొంతమంది ఈ మిగిలిపోయిన అన్నాన్ని గ్రైండ్ చేసి చిప్స్ లేదా ఇతర స్నాక్స్ చేసి తింటుంటారు. ఈ మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్, లేదా పులిహోర చేస్తే మాత్రం మరింత గట్టిపడుతుంది.

దీన్ని అస్సలు తినాలనిపించదు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం అన్నాన్ని అప్పుడే వండిన దానిలా చేయొచ్చు. ఇది మిగిలిన అన్నాన్ని మెత్తగా, సాఫ్ట్ గా చేస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వేడి చేయడానికి ముందు కొన్ని నీళ్లను కలపండి

రాత్రిమిగిలిన అన్నంలో మీరు నీళ్లను కలిపి వేడి చేయొచ్చు. అన్నాన్ని తిరిగి సాఫ్ట్ గా, హైడ్రేట్ చేయడంలో వాటర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇందుకోసం ఒక కప్పు అన్నంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లను పోసి కాసేపు ఆవిరి పెట్టండి. ఇందుకోసం మైక్రోవేవ్-సేఫ్ గిన్నెలో అన్నాన్ని ఉంచి మైక్రోవేవ్ లో 2 నిమిషాలు వేడి చేయండి. ఆవిరిని గ్రహించి తేమ వల్ల అన్నం మృదువుగా అవుతుంది. 
 

Latest Videos


మైక్రోవేవ్ లో అన్నాన్ని వేడి చేయండి

మైక్రోవేవ్ లో మీరు అన్నంలో డైరెక్ట్ గా నీళ్లను పోసి వేడి చేయడానికి బదులుగా తడి కాగితపు టవల్ ఉపయోగించి మెత్తగా, సాఫ్ట్ గా చేయొచ్చు. ఇందుకోసం మిగిలిపోయిన అన్నాన్ని మైక్రోవేవ్-సేఫ్ డిష్ లో సమానంగా అన్నాన్ని పెట్టండి.

దీనిపై తడి కాగితపు టవల్ ను ఉంచండి. మైక్రోవేవ్ లో పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు వేడి చేయండి. ఈ తడి టవల్ ఆవిరిని సమానంగా పంపిణీ చేస్తుంది. అన్నాన్ని తడిగా లేదా మెత్తగా చేయకుండా తిరిగి హైడ్రేట్ చేస్తుంది.

కొద్దిగా నూనె వేసి వేయించండి

మిగిలిపోయిన అన్నాన్ని త్వరగా వేడి చేయాలనుకుంటే.. ఒక పాన్ లో కొద్దిగా నూనె లేదా వెన్న రాయండి. మీడియం మంట దీన్ని వేడి చేసి  అన్నం వేసి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను చళ్లండి. బాణలిపై మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి.

అన్నం సమానంగా వేడి కావడానికి అప్పుడప్పుడు అన్నాన్ని కలుపుతుండండి. వేయించడం వల్ల అన్నానికి కొంత తేమ అందుతుంది. అతేకాదు కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది. నూనె లేదా వెన్న వల్ల అన్నం మెత్తబడుతుంది. 

కూరగాయలతో వేయించాలి

కూరగాయలు లేదా మాంసంతో మిగిలిపోయిన అన్నాన్ని తినాల్సి వస్తే బాగా వేడి చేయాలి. ఇలా చేసేటప్పుడు అన్నంలో కొన్ని నీళ్లు పోసి వేడి చేయండి. ఇది అన్నాన్ని టేస్టీగా చేయడమే కాకుండా.. మృదువుగా కూడా చేస్తుంది.

కూరగాయలు లేదా మాంసాలను వేడి చేయడం వల్ల వాటి నుంచి రసం విడుదలవుతుంది. తర్వాత దీనిలో అన్నాన్ని వేసి చేయండి. ఇది మంచి టేస్టీ వంటకంగా మారుతుంది. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ ను చట్నీ లేదా ఊరగాయతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. 

అన్నంలో కొద్దిగా పాలు పోసి వేడి చేయండి

డ్రై రైస్ అంత టేస్టీగా ఉండదు. అయితే మీరు దీన్ని కూరగాయలతో వేడి చేయకూడదనుకుంటే.. దాని రుచిని పెంచడానికి అందులో కొద్దిగా పాలు పోసి వేడి చేయండి.

ఇందుకోసం ఒక బాణలిలో బియ్యాన్ని వేసి ఒకటి లేదా రెండు టీస్పూన్ల పాలు పోసి మూతపెట్టి కుక్కర్లో ఆవిరి పట్టండి. అన్నం పాలను గ్రహించి మెత్తబడే వరకు మీడియం మంట మీద నెమ్మదిగా కలుపుతూ ఉండండి. ఇది మిగిలిపోయిన అన్నాన్ని హైడ్రేట్ చేసి చిక్కగా చేసి కొద్దిగా తీయగా చేస్తుంది. 

click me!