వసంతకోకిలల గానంతో, కొత్త చివురుల ఆగమనంతో వచ్చే తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రత్యేక పండుగ. యుగానికి ఆది అని సృష్టికి ఆది అని కూడా పరిగణిస్తారు. అందుకే ఈ రోజు బ్రహ్మను పూజిస్తారు.
undefined
ఇంత ప్రత్యేకమైన రోజు.. మరింత ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాల రుచితో మీ కుటుంబసభ్యులను ఆనందపరచండి. ఆ సంప్రదాయవంటకాలు మీ కోసం..
undefined
కోసాంబరితయారీకి అవసరమైన పదార్థాలు-12 కప్పు పెసర పప్పు4 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి1 టేబుల్ స్పూన్ నిమ్మరసం1 టేబుల్ స్పూన్ ఆవాలు2 కరివేపాకు రెబ్బలు1 కప్పు దోసకాయ తురుము2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర1 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్14 టీస్పూన్ ఇంగువ14 టీస్పూన్ నల్ల మిరియాలుఉప్పు రుచికి తగినంత..
undefined
తయారు చేసే విధానం...ముందుగా పెసర పప్పును ఒక గంట సేపు నీటిలో నానబెట్టాలి. తరువాత ఒక పాన్ లో నీటితో పాటు వేసి ఉడికించాలి. పప్పు కాస్త మెత్తబడే వరకు ఇలా ఉడకనివ్వండి. ఇప్పుడు నీటిని ఒంపేసి పప్పు పక్కన పెట్టుకోండి.తరువాత ఒక గిన్నెలో తురిమిన దోసకాయ, కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, నల్ల మిరియాలు వేసి కలపండి. ఆ తరువాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెసర పప్పు వేసి బాగా కలపాలి.ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయండి.. దీంట్లో ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడగానే తీసేయండి. దీన్ని ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమానికి జతచేసి కలపండి. అంతే రుచికరమైన సలాడ్ వడ్డించడానికి సిద్ధమై పోతుంది.
undefined
బేవు బెల్లాతయారీకి అవసరమైన పదార్థాలు-1 టీస్పూన్ వేప పువ్వులు,2 టేబుల్ స్పూన్ల చింతపండు,4 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు1 చిన్న పచ్చిమిర్చి4 టేబుల్ స్పూన్ల బెల్లం2 కప్పుల నీళ్ళు4 టేబుల్ స్పూన్లు పచ్చిమామిడికాయ ముక్కలు
undefined
తయారు చేసే విధానం-ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు తీసుకొని అందులో చింతపండు వేసి కొద్దిసేపు నానబెట్టాలి. తరువాత గుజ్జును పూర్తిగా పిండాలి. దీన్ని వడకట్టి చింతపండు నీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి.ఇప్పుడీ గిన్నెలో బెల్లం వేసి బాగా కలపాలి. దీనికి కొబ్బరి, పచ్చి మామిడి ముక్కలు కలపాలి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా దీనికి కలపొచ్చు.ఆ తరువాత ఈ మిశ్రమానికి 1 స్పూన్ వేప పువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు చేసి కలపాలి. 30-40 నిమిషాలు చల్లబరచండి. అంతే బెవు బెల్లా రెడీ అయినట్టే..ఇది తెలంగాణలో చేసే ఉగాది పచ్చడిలా ఉంది. కొద్దిగా మార్పులు, చేర్పులతో ఇలాంటిదే మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటాం.
undefined
బెల్లం పరమన్నంఅవసరమైన పదార్థాలు-14 కప్పు పెసర దాల్12 కప్పు బియ్యం4 కప్పుల పాలు250 గ్రాముల పొడి బెల్లం10 జీడిపప్పులు10 బాదం పప్పులు10 ఎండుద్రాక్ష4 టీస్పూన్ల నెయ్యి1 కప్పు నీళ్లు 1 టీస్పూన్ ఏలకుల పొడి
undefined
తయారు చేసే విధానం-బియ్యం, పెసర పప్పును ముందుగా 20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత స్టౌ మీ పాన్ పెట్టి.. అది వేడెక్కాక మంట మీడియం చేసి బెల్లం పొడి వేసి, సగం కప్పు నీళ్లు పోసి కరిగించాలి.అది కరిగి మృదువైన పేస్ట్ లా అయిన తరువాత మంట తీసేయాలి. మరో బాణాలి తీసుకుని అందులో పాలు పోసి మరిగించండి. ఈ పాలలో నానబెట్టిన బియ్యం, పప్పు వేసి కలపండి. ఇందులో మిగిలిన సగం కప్పు నీరు పోసి 10-15 నిమిషాలు ఉడికించాలి.ఇప్పుడు ఓ చిన్న బాణలిలో నెయ్యి వేడి చేసి, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు వేసి, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. దీన్ని పాలలో ఉడికించిన బియ్యం, పప్పుల మిశ్రమానికి కలపండి, దీంతోపాటే బెల్లం పేస్టును, ఏకలు పొడిని వేసి బాగా కలిపి మరో 10 నిమిషాలు ఉడికించాలి. అంతే బెల్లం పరమన్నం వడ్డించడానికి రెడీ.
undefined
మామిడికాయ పులిహోర..అవసరమైన పదార్థాలు-1 కప్పు బియ్యం2 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశెనగపప్పు1 టీస్పూన్ శనగపప్పు14 టీస్పూన్ ఇంగువ14 టీస్పూన్ పసుపు1 టేబుల్ స్పూన్ వెజిటబుల్ ఆయిల్1 ఎండుమిరప34 కప్పు పచ్చి మామిడి తురుము1 టీస్పూన్ ఆవాలు1 టీస్పూన్ మినప పప్పు2 రెబ్బల కరివేపాకు3 టీస్పూన్లు కొబ్బరి తురుముఉప్పు రుచికి తగినంత
undefined
తయారు చేసే విధానం..ముందుగా కప్పు బియ్యాన్ని అన్నం వండి పక్కన పెట్టుకోండి. తరువాత ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపపప్పు, వేరుశనగ పప్పు కలపండి, కాస్త వేగాక ఇందులో పచ్చి మామిడి తురుము, పసుపు వేసి బాగా కలిపి కాసేపు ఉడికించాలి. ఆ తరువాత ముందుగా వండి పక్కన పెట్టుకున్న అన్నం వేసి కలిపి, రుచికి సరిపడా ఉప్పు కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ.
undefined
గుత్తి వంకాయ కూర..తయారీకి కావాల్సిన పదార్థాలు-4 మీడియం సైజు వంకాయలు1 టీస్పూన్ ఆవాలుకరివేపాకు1 కప్పు ఉల్లిపాయ1 టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర కారం1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి1 టీస్పూన్ అల్లం1 టీస్పూన్ వెల్లుల్లి2 లవంగాలు2 టేబుల్ స్పూన్ల వెజిటెబుల్ ఆయిల్1 టీస్పూన్ జీలకర్ర1 పచ్చిమిర్చి1 టీస్పూన్ పసుపు12 కప్పు చింతపండు రసం2 టేబుల్ స్పూన్ల వేయించిన వేరుశెనగ12 టీస్పూన్ కొత్తిమీరఅర అంగుళాల దాల్చినచెక్కఉప్పు రుచికి తగినంత
undefined
తయారు చేసే విధానం-వంకాయలను తొడిమ తీయకుండా నాలుగు భాగాలుగా మధ్యకు కోసుకోవాలి. వీటిని ఉప్పునీటిలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలో కూరడానికి మసాలా తయారు చేసుకోవాలి.దీనికోసం వేరుశెనగ, నువ్వులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొబ్బరి పొడి, కొత్తిమీర కలిపి వేయించుకోవాలి. తక్కువ మంట మీద 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత కాస్త చల్లారబెట్టి మిక్సీతో మెత్తగా రుబ్బాలి, దీంతో వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ½ కప్ ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా రుబ్బాలి. దీనికి 2-4 టేబుల్ స్పూన్ల నీరు చేర్చి థిక్ పేస్ట్ లా చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కొద్దిగా ముందుగా చీల్చి పెట్టుకున్న వంకాయల్లో కూరి పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొంచెం నూనె వేడి చేసి, ఇందులో ½ కప్ ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిర్చి వేయాలి. ఆ తరువాత చింతపండు రసం వేసి బాగా కలపాలి. ఆ తరువాత వంకాయలు వేసి, మిగిలిన మిశ్రమం కూడా వేసి కలపాలి. మిశ్రమం బాగా గట్టిగా ఉందనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి.
undefined