బిస్కెట్లతో.. టేస్టీ గులాబ్ జామూన్స్ తయారీ.. !

First Published | Oct 30, 2021, 12:58 PM IST

కేవలం ఇంట్లో పిల్లలు తినే బిస్కెట్ల తో కూడా గులాబ్ జామ్ చేయవచ్చు తెలుసా..? వాటి తయారీ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం..

అన్ని స్వీట్లలో కెల్లా గులాబ్ జామూన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే.. అలా కరిగిపోతాయి. పెద్దవారి దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అ ందరూ ఈ గులాబ్ జామ్ ని ఇష్టంగా తినేస్తూ ఉంటారు. మరి ఈ గులాబ్ జామ్ ని.. ఈ దీపావళి పండగ రోజు ప్రత్యేకంగా.. మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పటి వరకు మనం గులాబ్ జామూన్స్ ఎలా తయారు చేసుకొని ఉంటాం... మార్కెట్లో లభించే.. గులాబ్ జామ్స్ మిక్స్ తో చేసి ఉంటారు. అయితే.. అది లేకుండా.. కేవలం ఇంట్లో పిల్లలు తినే బిస్కెట్ల తో కూడా గులాబ్ జామ్ చేయవచ్చు తెలుసా..? వాటి తయారీ ఎలానో ఇప్పుడు మనం చూద్దాం..
 

Latest Videos


గులాబ్ జామూన్ చేయడానికి, మీకు ఏమి కావాలి?
1 ప్యాకెట్ ParleG బిస్కెట్లు
2 టేబుల్ స్పూన్లు లేదా పాలు
2 టీస్పూన్లు మైదా
2 టీస్పూన్లు పాల పొడి
1/2 కప్పు చక్కెర
నెయ్యి
1/2 కప్పు నీరు
1/2 టీస్పూన్ యాలకుల పొడి
1 టీస్పూన్ బాదం చిన్నది (అలంకరణ కోసం)

బిస్కెట్లతో గులాబ్ జామూన్ చేయడానికి, ముందుగా ఒక సిరప్ తయారు చేయాలి. బాణలిలో నీరు చక్కెర వేసి మరిగించాలి. లేత పాకం వచ్చే వరకు పంచదార పాకాన్ని మరిగించాలి. అలా వస్తే.. గులాబ్ జామ్ సిరప్ రుచిగా ఉంటుంది. దాంట్లో యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు పార్లేజీ బిస్కెట్స్ తీసుకొని.. వాటిని జార్ లో వేసి బ్లెండ్ చేయాలి. ముక్కలు లేకుండా.. మెత్తని పొడి లా గా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మెత్తగా చేసుకొని పొడిని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత అందులో పాలపొడి, మైదా వేసి.. మొత్తాన్ని ముందుగా సిద్దం చేసుకున్న పాలతో బాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి.

తర్వత చేతికి కొద్దిగా నెయ్యి తీసుకొని.. పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండలను ఒక పక్కన పెట్టుకోవాలి.

మరో వైపు ఓ బాణలీలో నూనె గానీ, నెయ్యి గానీ పోసి వేడి చేయాలి. అదిగా బాగా కాగిన తర్వాత... అందులో.. ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఉండలను వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి.

ఆ తర్వాత.. కాల్చిన ఉండలను చల్లారే వరకు కాసేపు పక్కన ఉంచాలి. అవి చల్లారిన తర్వాత.. వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకున్న షుగర్ సిరప్ లో వేయాలి. ఇక్కడ ఉండలు, సిరప్ చల్లగా ఉండేలా చూసకోవాలి. లేదంటే విరిగిపోయే ప్రమాదం ఉంది.

అంతే టేస్టీ గులాబ్ జామ్స్ రెడీ.. దీనిలో.. ఇప్పుడు అలంకరణ కోసం సన్నగా తరిగి ఉంచిన బాదం పప్పు ను వేసుకోవచ్చు. అంతే.. సింపుల్ గా.. పెద్దగా ఎక్కువ ఖర్చు లేకుండా టేస్టీగా గులాబ్ జామ్స్ తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో గులాబ్ జామ్ మిక్సర్ కొనడానికి అయ్యే ఖర్చు తగ్గుతుంది. చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు.

మరో విషయం ఏమిటంటే.. పైన తయారు చేసుకున్న గులాబ్ జామ్ మిక్స్ తో కుకీస్ కూడా చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న పిండిలో పంచదార వేసి..   కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు బాగా కలపాలి.

ఆ తర్వాత.. వాటిని చిన్న కుకీస్ షేప్స్ లో తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ.. దాదాపు అరగంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆ తర్వాత  బ్రేకింగ్ ట్రేకి నెయ్యి రాసి.. వాటిని దానిపై ఉంచాలి. 

ఆ తర్వాత.. వాటిని చిన్న కుకీస్ షేప్స్ లో తయారు చేసుకోవాలి. వాటన్నింటినీ.. దాదాపు అరగంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఆ తర్వాత  బ్రేకింగ్ ట్రేకి నెయ్యి రాసి.. వాటిని దానిపై ఉంచాలి. 

తర్వాత 160 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 15 నుంచి 20 నిమిషాలపాటు ఉంచితే.. టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ మిక్స్ కుకీస్ తయారు చేసుకోవచ్చు. బేక్ చేసే సమయంలో.. కుకీస్ పై డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. మరింత రుచిని అందిస్తాయి. 

click me!