మిగిలిన చపాతీలతో ఈ టేస్టీ టేస్టీ వంటలు చేసి తినొచ్చు.. మీరూ ట్రై చేయండి

First Published | Sep 5, 2024, 1:18 PM IST

మిగిలిపోయిన చపాతీలను పడేయకండి! వాటితో పిజ్జా, లడ్డూ, పకోడా, ఖీర్, నూడుల్స్, ఉప్మా, టిక్కీ వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు.

చాలా మంది మిగిలిపోయిన చపాతీలను తీసుకెళ్లి డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఇక పనికి రావు అని. కానీ మిగిలిపోయిన చపాతీలు ఏం పాడవవు. మీరు వీటిని కూడా ఎంచక్కా తినొచ్చు. అలాగే తినాలనిపించకపోతే మీరు వీటితో డిఫరెంట్ వంటకాలను ట్రై చేయొచ్చు. అవును మిగిలిపోయిన చపాతీలతో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల రెసిపీలను తయారుచేసి తినొచ్చు. ఇవి పెద్దలకు, పిల్లలు ఇలా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అందుకే మిగిలిపోయిన చపాతీలతో ఏమేమి చేసి తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

రోటీ పిజ్జా

అవును మీరు మిగిలిపోయిన చపాతీలతో టేస్టీ టేస్టీ రోటీ పిజ్జాను తయారుచేసి ఎంచక్కా తినొచ్చు. ఈ రోటీ పిజ్జాను చాలా ఈజీగా, తొందరగా తయారుచేయొచ్చు. ఈ రోటీ పిజ్జాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీన్ని తయారుచేయడానికి మిగిలిన రోటీపై జున్ను, మొక్కజొన్న, మసాలా, పనీర్, పిజ్జా సాస్ మొదలైనవి వేసి కాసేపు బేక్ చేయండి అంతే.. టేస్టీ టేస్టీ రోటీ పిజ్జా రెడీ అయినట్టే.
 



రోటీ చుర్మా లడ్డూ 

రోటీ చుర్మా లడ్డూలను పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. వీటిని కూడా మీరు చాలా సింపుల్ గా, తొందరగా తయారుచేయొచ్చు. వీటిని తయారుచేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరముండవు. ఇందుకోసం మిగిలిన రోటీని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేయండి. దీంట్లో పంచదార, నెయ్యి వేసి చుర్మా లడ్డూలను తయారుచేయండి. 

రోటీ పకోడా 

మిగిలిపోయిన రోటీలతో మీరు అందరూ ఇష్టంగా తినే పకోడీలను కూడా తయారుచేయొచ్చు. దీనికోసం మిగిలిపోయిన రోటీలను ముక్కలు ముక్కలుగా కట్ చేయండి. దీన్ని శనగపిండిలో అద్ది పకోడీలు తయారుచేయండి. మిగిలిపోయిన రోటీ చాలా క్రిస్పీగా మారుతాయి. 

రోటీ ఖీర్ 

మీరు మిగిలిన రోటీలతో నోరూరించే రోటీ ఖీర్ ను కూడా తయారుచేయొచ్చు. ఇందుకోసం మిగిలిన రోటీని మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్ని మరుగుతున్న పాలలో వేసి మెత్తగా అయ్యాక అందులో బెల్లం వేయండి. అంతే వేడి వేడి రోటీ ఖీర్ రెడీ అయినట్టే. 

రోటీ నూడుల్స్ 

నూడుల్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే మీరు మిగిలిన రోటీలతో నూడుల్స్ ను కూడా తయారుచేయొచ్చు. ఇందుకోసం మిగిలిన రోటీలను నూడుల్స్ లాగా పొడవుగా కట్ చేయండి. ఉల్లిపాయ, సోయా సాస్, టొమాటో సాస్, క్యాప్సికమ్ తదితర వాటితో కలిపి రోటీ నూడుల్స్ ను తయారుచేయండి. 

రోటీ ఉప్మా 

మిగిలిపోయిన రోటీలతో చేసిన ఉప్మా బలే టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారుచేయడానికి మిగిలిన రోటీని మిక్సీ జార్ లో గ్రైండ్ చేయండి. తర్వాత కాసేపు వేయించండి. తర్వాత ఉప్మాలా తయారుచేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే రోటీ ఉప్మా రెడీ అయినట్టే. 

రోటీ టిక్కీ 

రోటీ టిక్కీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మిగిలిన రోటీని పొడి చేసి బంగాళాదుంపలు, మసాలా దినుసులు, కొత్తిమీర, పచ్చిమిర్చి తదితరాలు వేసి టిక్కీ తయారుచేయండి. రెడ్ అండ్ గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. 
 

Latest Videos

click me!