తిందామని వండుకుంటాం... తినకుండానే వదిలేస్తాం. మిగిలిపోయిన దానిని జాగ్రత్తగా ఫ్రిడ్జిలో పెట్టేస్తాం. మరుసటి రోజు దానిని వేడి చేసుకొని తినడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. కానీ.. అలా తినడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత ప్రమాదమంటే.. అలా వేడుచేసుకొని తినడం వల్ల విషమం కన్నా ప్రమాదని హెచ్చరిస్తున్నారు. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
అన్నం.. అందరి ఇళ్లల్లో కామన్ ఉండే ఆహారం అన్నం. దాదాపు మనమంతా రోజు ఇదే తింటాం. ఈ అన్నంలో స్పోర్స్ ఉంటాయి.. అవి బ్యాక్టీరియా గా మారిపోయాతాయి. మనం బియ్యాన్ని అన్నంగా ఉడికించిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి.
కాబట్టి.. దీనిని స్టోర్ చేసి తర్వాత వేడుచేసుకొని తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది.
కోడిగుడ్డు.. కోడిగుడ్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ప్రోటీన్ కి కోడిగుడ్డు బెస్ట్ సోర్స్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే.. అదే కోడిగుడ్డు నిల్వ చేస్తే మాత్రం విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.
ఉడకపెట్టిన కోడిగుడ్డు మరసటి రోజు తినడం అంటే అది విషంతో సమానమే. కాబట్టి ఉడకపెట్టిన గుడ్డుని స్టోర్ చేసుకొని అస్సలు తినకూడదు.
ఆలుగడ్డ.. కామన్ గా అందరి ఇళ్లల్లో ఉపయోగించే కూరగాయల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఫ్రెష్ గా ఉన్నప్పుడు వీటిని వాడుకొని తినొచ్చు. కానీ ఒక్కసారి ఉడకపెట్టిన ఆలుగడ్డలను మరోసారి వేడి చేసి తినకూడదట. అలా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది.
చికెన్.. చికెన్ ని మనలో చాలా మంది ఫ్రిడ్జ్క్ష్ లో పెట్టేసి మరుసటి రోజు వేడిచేసుకొని తినేస్తాం. కానీ చికెన్ ని అలా వేడి చేసుకొని అస్సలు తినకూడదట. రీ సైకిల్ చేసిన చికెన్ లో ఎలాంటి న్యూట్రిషన్స్ ఉండవు. పైగా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మష్రూమ్స్.. మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి చాలా మంది ఫేవరేట్ ఫుడ్ కూడా. అయితే.. వీటిని రెండోసారి ఉడకపెట్టడం వల్ల దానిలోని న్యూట్రిషన్స్ తగ్గిపోయి.. విషంగా మారతాయి. అరుగుదల సమస్యలు కూడా వస్తాయి.
ఆకు కూరలు.. ఆకుకూరలు విటమిన్స్, న్యూట్రిషన్స్ కి బెస్ట్ సోర్స్ అని అందరూ చెబుతారు. అయితే.. వేడిచేసుకొని తింటే మాత్రం అనారోగ్యానికి దారి తీస్తాయి.
పాలకూర.. ఐరన్, నైట్రేట్స్ పుష్కలంగా లభించే పాలకూరను రీ కుక్ చేసుకొని తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ఎప్పుడూ వండి ఆహారాన్ని మళ్లీ వేడిచేసుకొని తినకూడదు. తాజా కూరగాయలతో చేసుకొని తింటే ఆరోగ్యం లభిస్తుంది.