రాత్రిపూట ఈ డ్రింక్ తాగి పడుకుంటే.. బరువు తగ్గడం సులువు..!

First Published | Feb 19, 2021, 2:41 PM IST

ఈ తిప్పలేమీ లేకుండా సులభంగా బరువు తగ్గాలంటే... ఈ సింపుల్ డ్రింక్స్ తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలని కోరుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. దాని కోసం వాళ్లు చేయని ప్రయత్నాలంటూ ఉండవు. ముందుగా తిండి తినడం మానేస్తారు. లేదంటూ జిమ్ముల వెంట పరుగులు తీసేస్తారు.
అయితే.. ఈ తిప్పలేమీ లేకుండా సులభంగా బరువు తగ్గాలంటే... ఈ సింపుల్ డ్రింక్స్ తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

1.గ్రీక్ యోగర్ట్ ప్రోటీన్ షేక్..బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేసే అలవాటు మీకు ఉంటే... పడుకునే ముందు ఈ ప్రోటీన్ షేక్ తాగితే చాలా మంచిది. సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా దానిలో ఉండే ప్రోటీన్ మజిల్స్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని క్యాలరీస్ మొత్తం తగ్గిపోతాయి. ఇక పాలల్లో ఉండే కాల్షియం మనకు మంచి నిద్రను కూడా అందిస్తుంది. ఈ ప్రోటీన్ షేక్ బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
2.చమోమిలీ టీ..చమోమిలీ టీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. శరీరంలో గ్లైసిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది, ఇది ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్, ఇది మీ నరాలను సడలించి మీకు నిద్రను కలిగిస్తుంది. కడుపు నొప్పికి కూడా ఇది మంచిది.చమోమిలే టీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, నిద్రపోవడానికి ముందు రోజూ ఒక కప్పు తాగడం మంచిది.
3.దాల్చినచెక్క టీ..దాల్చినచెక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది. ఇది భారతీయ వంటగదిలో తప్పనిసరిగా ఉండే పదార్ధం. ఇది సాధారణంగా జీవక్రియ-పెంచే లక్షణాలకు ప్రసిద్ది. ఇది యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక ఖచ్చితమైన డిటాక్స్ పానీయంగా చేస్తుంది. ఇది కొవ్వు కరగడానికి సహాయ పడుతుంది. కావాలంటే కొద్దిగా తేనను కూడా అందులో కలుపుకోవచ్చు.
4.నానపెట్టిన మెంతులు..నానబెట్టిన మెంతి విత్తనాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో బాగా పనిచేస్తాయి. ఇది సాధారణంగా ఉదయం సమయంలో తీసుకుంటారు. కాని రాత్రిపూట కూడా తినవచ్చు. విత్తనాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి అంతేకాకుండా బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
5. పసుపు కలిపిన పాలు..పసుపు పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గిపోతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. పసుపులో యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. అవి శరీరంలోని ట్యాక్సిన్స్ బయటకు రావడానికి సహాయపడతాయి.

Latest Videos

click me!