సాధారణంగానే పప్పు లో చాలా పోషకాలు ఉంటాయి. ఒక చిన్న గిన్నెడు పప్పులో మనకు 32 శాతం ఫైబర్ అందుతుంది. అంతేకాదు... ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్ లాంటివి కూడా అందుతాయి. మన శరీరంలో కొలిస్ట్రాల్ లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు రెగ్యులర్ గా పప్పు తినడం వల్ల డయాబెటిక్స్, కొలన్ క్యాన్సర్ లాంటివి మన దరి చేరకుండా కూడా ఉంటాయి. ఇలాంటి ఉపయోగాలు ఉన్న పప్పులను ఉడకపెట్టి ఆ నీరు తాగడం వల్ల కూడా అంతకు మించి ఉపయోగాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు.