బరువు తగ్గాలనుకునేవారికి.. తక్కువ క్యాలరీలతో హెల్దీ ఫుడ్..

First Published | Mar 20, 2021, 11:15 AM IST

కొన్ని ఆహారాల హెల్దీ ఫుడ్స్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్స్ ఆర్యోగానికి ఉపయోగకరమైనవి అంతేకాకుండా.. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఈ రోజు అధిక బరువు సమస్య చాలా మందిని వేధిస్తుంది. బయట ఆహారానికి రుచి మరిగి.. ముఖ్యంగా జంక్ ఫుడ్ కారణంగా అధిక బరువు పెరిగి.. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏది తింటే బరువు పెరిగిపోతామో అని కడుపు కాల్చుకుంటున్నారు. అలా తిండి తినక.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందక.. మరో కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
undefined
మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కొన్ని ఆహారాల హెల్దీ ఫుడ్స్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫుడ్స్ ఆర్యోగానికి ఉపయోగకరమైనవి అంతేకాకుండా.. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం అవసరం లేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
undefined

Latest Videos


1.ఓట్స్..ఓట్స్ ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే.. ఎక్కువ సేపు ఆకలిని కంట్రోల్ చేయగలం. ఇది తింటే బరువు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి.
undefined
2. సూప్స్..సూప్ తాగితే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనిలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కూరగాయలతో చేస్తాం కాబట్టి.. ఆరోగ్యం కూడా లభిస్తుంది. న్యూట్రిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. తాగిన వెంటనే శక్తి లభిస్తుంది.
undefined
3.చియా సీడ్స్..చియాసీడ్స్ తో తయారు చేసిన డ్రింక్స్, డిసర్ట్స్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. వీటిలో ఫ్యాట్ ఉండదు. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అరుగుదల సమస్య కూడా తగ్గుతుంది.
undefined
4.కోడిగుడ్డు..కోడిగుడ్డు బెస్ట్ ప్రోటీన్ సోర్స్. 6గ్రాముల కోడిగుడ్డులో 72క్యాలరీలు ఉంటాయి. ఇది తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి తీరడంతోపాటు.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి.
undefined
5.పాప్ కార్న్..నమ్మసక్యంగా లేకపోయినా.. పాప్ కార్న్ తింటే బరువు తగ్గొచ్చట. ఇవి తింటే.. కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. దీనిలో ప్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్న్ లో ప్రోటీన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి.
undefined
6. చేప..చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఫ్యాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
undefined
7.పనీర్..పనీర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.
undefined
click me!