మామిడి పండు తింటే బరువు పెరుగుతారా...?

First Published | Mar 19, 2021, 10:51 AM IST

మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. కేవలం ఒక్క శాతం మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. 

వేసవికాలం మొదలైంది. ఎండాకాలం అనగానే... అందరికీ ముందుగా.. మామిడి పండ్లే గుర్తుకు వస్తాయి. ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి.. అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు.
అయితే.. డైటింగ్ లో ఉన్నవారు మాత్రం ఈ పండు తినాలంటే కొంచెం భయపడిపోతారు. ఎందుకంటే... ఎక్కడ మామిడి తింటే.. బరువు పెరిగిపోతామో అని కంగారు పడతారు. అయితే.. నిజంగా మామిడి పండు తింటే.. బరువు పెరుగుతారా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీ లాంటి ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. కేవలం ఒక్క శాతం మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి.. దానికి బరువు పెరుగుతారనడంలో ఎలాంటి నిజం లేదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు మామిడి పండ్లు తినడం వల్ల అరుగుదల సమస్య ఉండదు.వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు.
మామిడి, అరటి.. రెండింట్లోనూ పీచు పదార్థం ఎక్కువ. మామిడిలో విటమిన్‌-ఎ, యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి కూడా అధికమే.
మామిడి పండ్లలో చక్కెర మోతాదు ఎక్కువ కాబటి,్ట డయాబెటిస్‌ ఉన్నవాళ్లు తినకూడదని అంటారు. కానీ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటే చిన్న సైజు మామిడి ముక్కలు తినొచ్చు. తొక్కతో పాటు తింటే ఇంకా మంచిది. ఫైబర్‌ ఎక్కువగా దొరుకుతుంది. అరటి పండు కూడా తేలికైన ఆహారమే.
దీనిలో కూడా పోషకాలు పుష్కలం. విటమిన్‌ బి6, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బరువు పెరుగుతామేమో అనే అపోహతో వీటిలో ఉండే పోషకాలకు దూరం కాకూడదు. అయితే ఏ పదార్థమైనా మితిమీరి తీసుకుంటే చివరికి కొవ్వుగా నిల్వ అవుతుంది. కాబట్టి ఈ పండ్ల్లే కాదు .. ఏదైనా మితంగానే తీసుకోవాలి.
అయితే.. మిల్క్ షేక్, జ్యూస్ ఇలా మాత్రం మామిడి పండు తీసుకోకూడదట. చాలా మంది ఐస్ క్రీమ్ లో తింటుంటున్నారు. ఇలా తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది. నార్మల్ గా పండు తింటే ఎలాంటి బరువు పెరగరు.

Latest Videos

click me!