కలయిక మధ్యలో నీరసం.. ఒక్క స్పూన్ ఇది తింటే...!

First Published | Mar 17, 2021, 1:02 PM IST

అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కొన్ని సూపర్ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..

ఉదయాన్నే ఆఫీసుకు పరిగెత్తడం..ఏదో తిన్నామా అంటే కొంచెం తినడం.. మళ్లీ రాత్రికి ఎప్పుడో ఇంటికి రావడం.. పని ఒత్తిడి కారణంగా.. అసలు తీరిక ఉండటం లేదు. ఈ క్రమంలో చాలా మంది పురుషులు ఫిజికల్ గా వీకైపోతున్నారు. కనీసం తమ కంటూ సమయం కేటాయించడానికి కూడా సంయం ఉండటం లేదు. ఈ ఎఫెక్ట్ అనారోగ్యం మీద కూడా పడే అవకాశం ఉంది.
ఎప్పుడో ఒకరోజు, రెండు రోజులు ఆరోగ్యం సరిగా లేక వీక్ గా కనిపిస్తే పర్వాలేదు. కానీ.. అలా కాకుండా... ఈ నీరసం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే.. కాళ్లనొప్పులు రావడం మొదలుపెడతాయి. కొద్ది పాటి పనికే అలసట రావడం.. ఏ పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.

అయితే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. కొన్ని సూపర్ ఫుడ్స్ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..
1.కోడిగుడ్డు..ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు తినడం అలవాటు చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేసే పురుషులు కచ్చితంగా గుడ్డు తినాలి. దీనిలో ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ మజిల్స్ స్ట్రాంగ్ గా ఉండేలా సహాయపడతాయి.
2.నెయ్యి..చాలా మంది నెయ్యి తింటే లావు అవుతాము అని అనుకుంటారు. అయితే.. ఈ నెయ్యి తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛమైన నెయ్యిలో విటమిన్ ఏ, డీ న్యూట్రియన్స్, మినరల్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి.ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.
3.శృంగారంలో పాల్గొన్న సమయంలో వెంటనే నీరసపడిపోతున్నామని మీకు అనిపిస్తే.. వెంటనే ఒక స్పూన్ నెయ్యి తింటే.. మళ్లీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది.
4. అరటిపండ్లు..అరటి పండ్లు.. మనకు అన్ని పండ్లలలో కెల్లా చాలా చీప్ గా లభిస్తాయి. ఇవి తింటే మనకు వెంటనే శక్తి వచ్చేస్తుంది. నీరసంగా అనిపించినప్పుడు ఒక్క పండు తిన్నా చాలు శక్తి వెంటనే వస్తుంది. దీనిలో పొటాషియ, ప్రోటీన్స్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇవి మహిళలు, పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరం.
అల్పాహారం గా ఉదయం రెండు అరటి పండ్లు తిని.. ఇంకేమీ తినకపోయినా మనకు నీరసం అనేది రాదని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి కాయలు..ఉసిరికాయలు తినడం వల్ల కూడా పురుషుల్లో శక్తి త్వరగా పెరుగుతుంది. రోజూ తినడం వల్ల జుట్టు పెరుగుదలకు కూడా చాలా మంచిది.
అంతేకాదు... ఉసిరి రోజూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఎండు ద్రాక్ష.. వీటిని రోజూ రాత్రిపూట 12 నాన పెట్టుకొని.. ఉదయాన్నే వాటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రక్తం తక్కువగా ఉన్నవారికి ఇవి చాలా మంచి చేస్తాయి. దీనిలో పొటాషియం, పొటాషియం ఉన్నాయి. టాక్సిన్స్ బయటకు వెళ్లడానిక కూడా సహాయం చేస్తాయి.
నానపెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ పెరగడానికి కూడా సహాయం చేస్తుంది.

Latest Videos

click me!