కేఎఫ్ సీ చికెన్ లో గొంగలి పురుగులు.. చూసుకోకుండా తినేసి...

First Published | Sep 15, 2020, 9:45 AM IST

కేఎఫ్ సీ ఫుడ్ ని ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదు అనే చెప్పాలి.  ఈ ఫుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. వీరు ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.

మీకు కేఎఫ్ సీ ఫుడ్ తినడం అంటే ఇష్టమా..? ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకొని హ్యాపీగా లాగించేస్తున్నారా..? అయితే.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇటీవల ఓ యువతి కేఎఫ్ సీ నుంచి పాప్ కార్న్ చికెన్ స్నాక్ బాక్స్ ని ఆర్డర్ చేసుకుంది.
చక్కగా కూర్చొని లాగించేద్దామని అనుకుంది.. కానీ.. అందులో ఉన్నది చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే.. అందులో గొంగలి పురుగులు కదులుతూ కనిపించాయి. ఈ సంఘటన కేంబ్రిడ్జ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేఎఫ్ సీ ఫుడ్ ని ఇష్టపడని వారి సంఖ్య చాలా అరుదు అనే చెప్పాలి. ఈ ఫుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. వీరు ప్రపంచవ్యాప్తంగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇటీవల ఒక అమ్మాయి కేంబ్రిడ్జ్‌లోని కెఎఫ్‌సి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పాప్‌కార్న్ చికెన్ స్నాక్ బాక్స్‌ను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత దానిని తినడం ప్రారంభించింది. అయితే.. ఆమెకు ఆ చిప్స్‌లో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా ఏంటా అది అని చూస్తే.. అవి గొంగళి పురుగులు కావడం గమనార్హం.
సదరు యువతి పేరు నికిత.. కాగా... తనకు ఎదురైన సంఘటనను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ నేను కేఎఫ్ సీ తినడం మొదలుపెట్టిన వెంటనే తనకు ఏదో కదులుతున్నట్లు కనిపించిందని.. తీరా చూస్తే పురుగులు ఉన్నాయని.. వెంటనే ఆ బాక్స్ ని విసిరేశాను. రెండు, మూడు చిప్స్ తిన్నందుకే తాను తర్వాత అస్వస్థతకు గురయ్యాను’’ అని ఆ యువతి తెలిపింది.
కాగా.. మరుసటి రోజు యువతి దీనిపై సదరు కంపెనీకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా.. వారు కనీసం వినించుకోలేదట. ఆ ఫుడ్ కి కనీసం రిఫండ్ కూడా ఇవ్వలేదట.

Latest Videos

click me!