బోరింగ్ కిచిడీ.. టేస్టీగా చేయడమెలా?

First Published Sep 12, 2020, 1:44 PM IST

దానిని అందరిలా కాకుండా టేస్టీగా చేస్తేనే మోదీ ఇష్టపడతారట. మరి ఆయన మెచ్చిన కిచినీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కిచిడీ ఈ పేరు వినగానే చాలా మంది అమ్మో బోరింగ్ అనేస్తుంటారు. ఇంకొందరైతే... అది పేషెంట్స్ ఫుడ్ అంటూ దాని జోలికి కూడా పోరు. మన దగ్గర కాస్త తక్కువ కానీ.. గుజరాత్ లో మాత్రం దీనిని ఎక్కువగా చేసుకుంటారు. అయితే.. చాలా మంది బోరింగ్ గా ఫీలయ్యే ఈ కిచిడీ అంటే మన ప్రధాని నరేంద్రమోదీకి చాలా ఇష్టం అంట.
undefined
అయితే.. దానిని అందరిలా కాకుండా టేస్టీగా చేస్తేనే మోదీ ఇష్టపడతారట. మరి ఆయన మెచ్చిన కిచినీ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..1 గిన్నె బియ్యం1 గిన్నె పప్పు1 పెద్ద ఉల్లిగడ్డ1 పెద్ద ఆలుగడ్డ2 టమాటాలుకొన్ని బఠానీలుఅర టీస్పూన్ నెయ్యిఅరటీస్పూన్ ఉప్పుఅరటీస్పూర్ కశ్మీరీ కారం పొడిపావుస్పూన్ పసుపుఅరటీస్పూన్ జీలకర్ర పొడికొద్దిగా ఇంగువ4గిన్నెల నీరు.
undefined
ఇప్పుడు తయారీ విధానం చూద్దాం.. ముందుగా బియ్యం, పప్పులను శుభ్రంగా కుడుక్కోవాలి. అనంతరం వాటిని కనీసం 15 నిమిషాల పాటు నాననివ్వాలి.
undefined
ముందుగా స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేయాలి. అది వేడి కాగానే.. కొద్దిగా జీలకర్ర, ఇంగువ పొడి వేయాలి.
undefined
తర్వాత అందులో ముందుగా ముక్కులుగా కోసి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలు అందులో వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేయాలి.
undefined
ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాట ముక్కలు కూడా చేర్చాలి. టమాట వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలి.
undefined
ఆ తర్వాత ముక్కులు వేగిన తర్వా త అందులో కడిగిన బియ్యం, పప్పు వేయాలి.
undefined
కొద్దిగా వీటీని వేయించి ఆ తర్వాత.. బియ్యం, పప్పులకు సరిపోయే నీరు పోయాలి.
undefined
కొద్దిగా గరం మసాలా ని కూడా చేర్చాలి. తర్వాత మొత్తం కలిపి ఆ తర్వాత.. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాలి.
undefined
స్టవ్ హైలో పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత పది నిమిషాలు సిమ్ లో ఉంచాలి.
undefined
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరిపోయేదాకా ఆగి.. కుక్కర్ మూత తీసి చూడాలి.
undefined
ఇంకేముంది గుమగుమలాడే కిచిడీ రెడీ. అందులో కొద్దిగా నెయ్యి వేసి.. వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.
undefined
click me!