టీలో బెల్లం వేయడం వల్ల వచ్చే సమస్యలు
శుద్ధి చేసిన చక్కెర కంటే బెల్లమే ఆరోగ్యానికి మంచిది. బెల్లం చక్కెరలా ఆరోగ్యాన్ని పాడు చేయదు. కానీ బెల్లం కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది. చక్కెర లాగే బెల్లాన్ని ఎక్కువగా తింటే మీరు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇది చక్కెర లాగే కేలరీలను ఎక్కువగా కలిగి ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే బెల్లాన్ని ఎక్కువగా తిన్నా మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే బెల్లం డయాబెటీస్ పేషెంట్లకు కూడా మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు.