పనస పండు మొరేసి కుటుంబానికి చెందింది. ఈ పండు భారతదేశంలోని పశ్చిమ కనుమలకు చెందింది. కానీ ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఈ ఇవి పండుతాయి. ఈ పండు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద తినదగిన పండుగా ప్రసిద్ది చెందింది. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పనస పండు గుజ్జు, విత్తనాలను కూరలుగా, ఉడకబెట్టడం అంటూ ఎన్నో రకాలుగా తింటుంటారు. ఈ పనస పండ్లు, ఈ చెట్టు ఆకులు, బెరడుతో సహా పనస చెట్టు వివిధ భాగాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే వీటిని సాంప్రదాయ వైద్యంలో ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు.