ఆలుగడ్డ అంటే ఇష్టమా..? మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

First Published | May 9, 2023, 2:37 PM IST

బంగాళాదుంపలలో ఫైబర్, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. బాగా నూనె వేసిన బంగాళాదుంప చిప్స్ లేదా ఫ్రైస్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. అయితే బరువు పెరుగుతామనే భయంతో చాలా మంది బంగాళాదుంపలకు దూరంగా ఉంటారు. నిజంగా బంగాళాదుంపలు బరువు పెరగడానికి కారణమవుతాయా? బంగాళాదుంపలు విటమిన్ సి కి గొప్ప మూలం. రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. 
 

బంగాళదుంపల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. వీటిలో ఫైబర్స్ కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
 


అయితే బంగాళాదుంపలను బాగా ఉడికించి మాత్రమే తినాలి. గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. బంగాళాదుంపలతో చేసిన ఏదైనా వంటకాన్ని తినేటప్పుడు పరిమాణంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.

ఒక మీడియం సైజ్ బంగాళాదుంపలో 110 కేలరీలు ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని బంగాళాదుంపలు తింటున్నారనే దానిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బంగాళాదుంపలను మితంగా, ఆరోగ్యకరమైన మార్గంలో తయారు చేసి తింటే సులువుగా బరువు తగ్గుతారు. 
 

బంగాళాదుంపలలో ఫైబర్, పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మీరు అతిగా తినడాన్ని కూడా నివారిస్తుంది. నూనె వేసిన బంగాళాదుంప చిప్స్ లేదా ఫ్రైస్ తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

Latest Videos

click me!