పెరుగులో వీటిని కలిపి తిన్నారో మీ పని అంతే..!

First Published | May 11, 2023, 11:38 AM IST

ఎండాకాలంలో పాల కంటే పెరుగే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. పెరుగును తింటే ఎండాకాలంలో మన శరీరం చల్లగా ఉంటుంది. బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. కానీ పెరుగులో కొన్ని ఆహారాను కలిపి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే పెరుగును సీజన్లతో సంబంధం లేకుండా తినాలని చెబుతుంటారు. రోజుకు కనీసం ఒక కప్పు పెరుగును తింటే ఆరోగ్యం బాగుంటుంది. పెరుగులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగును తింటే బోలు ఎముకల వ్యాధి నుంచి పీరియడ్స్ తిమ్మిరి, నొప్పి వరకు ఎన్నో రోగాలు తగ్గిపోతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెరుగులో కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. పెరుగులో వేటిని కలపకూడదంటే..
 

Image: Getty

చేపలు 

చేపలు మన  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో మంచి కొవ్వుతో పాటుగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కానీ చేపలను పెరుగుతో కలపకూడదు. ఇలా కలిపి తింటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. 
 


వేయించిన ఆహార పదార్థాలు

బాగా వేయించిన ఆహారాలు మన  ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచివి కావు. ఎందుకంటే వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వేయించిన ఆహార పదార్థాలను పెరుగుతో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Image: Getty Images

ఉల్లిపాయ

రైతాలో ఉల్లిపాయను తినే అలవాటు భారతదేశంలో చాలా మందికి ఉంది. ఉల్లిపాయ, చల్లబరిచే పెరుగులో విభిన్న స్వభావం ఉంటుంది.ఈ రెండింటి కాంబినేషన్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 
 

mango

మామిడి

ఎండాకాలంలోనే మామిడి పండ్లు పండుతాయి. అయితే మామిడిలో వేడి చేసే గుణం ఉంటుంది. పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఈ రెండింటిని కలిపినప్పుడు మామిడి వేడి స్వభావం మీ జీర్ణక్రియకు భంగం కలిగించే అవకాశం ఉంది.

పాలు

పాలతోనే పెరుగు అవుతుది. కానీ పెరుగులో సాదా పెరుగులో పాలను అస్సలు కలపకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన ఉబ్బరానికి దారితీస్తుంది.
 

టీ

టీని తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ పెరుగు తిన్న వెంటనే టీ ని తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది కడుపునకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. 

Latest Videos

click me!