పచ్చి మామిడికాయలు రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Apr 9, 2024, 9:58 AM IST

మామిడికాయలు ఒక్క ఎండాకాలంలోనే కాస్తాయి కాబట్టి చాలా మంది ప్రతి రోజూ మామిడికాయను తింటుంటారు. కానీ రోజూ మామిడి కాయలను తింటే ఏమౌతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? 
 

raw mango

ఏ మార్కెట్ లో చూసినా పచ్చి మామిడి కాయలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులయ్యాక పచ్చి మామిడి కాయల ప్లేస్ లో మామిడి పండ్లు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది మామిడి కాయల సీజన్ కాబట్టి. మామిడి కాయలు ఒక్క ఎండాకాలంలోనే కాస్తాయి కాబట్టి.. చాలా మంది వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. ఇప్పుడైతే మామిడి కాయలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలామంది ప్రతివంటలో మామిడి కాయను వేస్తుంటారు. అలాగే రోజూ అలాగే తింటుంటారు. కానీ రోజూ మామిడి కాయలను తింటే ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే? 

జీర్ణ సమస్యలు 

పచ్చిమామిడికాయలను అలాగే లేదా పప్పు, చారు, పచ్చడి వంటి ఎన్నో వంటల్లో వేసి తింటుంటారు చాలా మంది. కానీ పచ్చిమామిడి కాయలను ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. అలాగే విరేచనాలు అవుతాయి. ఎసిడిటీ సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos


mango

వేడిని పెంచుతుంది

మామిడి పండుతో పాటుగా పచ్చి మామిడిలో కూడా వేడి చేసే గుణాలు ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తింటే శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దీనివల్ల నోట్లో బొబ్బలు ఏర్పడతాయి. అలాగే మొటిమలు కూడా అవుతాయి. 

Mango

తక్కువ రక్తంలో చక్కెర 

బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు పచ్చి మామిడి కాయలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. పచ్చి మామిడికాయను మోతాదుకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. 
 

దంతాలకు ప్రమాదకరం 

పచ్చి మామిడి కాయలు మన దంతాల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పచ్చిమామిడికాయలోని పులుపు దంతాల సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది. చిగుళ్లలో నొప్పిని కలిగిస్తుంది. అందుకే పచ్చి మామిడి కాయలను ఎక్కువగా తినకూడదు.
 


గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం 

పచ్చిమామిడి కాయలను ఎక్కువగా తింటే గొంతు నొప్పి వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని మరీ ఎక్కువగా తినకండి. 

జలుబు, దగ్గు 

ఎండాకాలంలో కూడా చాలా మందికి దగ్గు, జలుబు సమస్యలు వస్తుంటాయి. ఇప్పటికే మీకు జలుబు, దగ్గు సమస్యలు ఉంటే పచ్చిమామిడి కాయను అస్సలు తినకండి. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది.
 

click me!