ప్రెజర్ కుక్కర్ ని వాడటం మంచిదా కాదా..?

First Published | Apr 8, 2024, 4:28 PM IST

ప్రెజర్ కుక్కర్ లో ఫుడ్ వండటం ఆరోగ్యానికి మంచిదేనా..? ఈ కుక్కర్ లో వంట వల్ల కలిగే లాభాలు ఏంటి..? నష్టాలు ఏంటో.. ఓసారి చూద్దాం...
 

pressure cooker

దాదాపు అందరి ఇళ్లల్లో ప్రెజర్ కుక్కర్ ఉంటుంది. నిజం చెప్పాలంటే ప్రెజర్ కుక్కర్ వచ్చిన తర్వాత.. వంట చేయడం చాలా సులువు గా మారిందని చెప్పొచ్చు.  దాదాపు చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజూ అన్నం ఆ ప్రెజర్ కుక్కర్ లోనే వండుతూ ఉంటారు. కానీ...ప్రెజర్ కుక్కర్ లో ఫుడ్ వండటం ఆరోగ్యానికి మంచిదేనా..? ఈ కుక్కర్ లో వంట వల్ల కలిగే లాభాలు ఏంటి..? నష్టాలు ఏంటో.. ఓసారి చూద్దాం...

pressure cooker


ముందు ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల కలిగే లాభాలు చూద్దాం..

1.ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండినా, పప్పు, కూర ఏది చేసినా  కొంచెం త్వరగా అయిపోతుంది. నార్మల్ గా వండటానికి పట్టే సమయం కంటే.. ఇది చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది.


dal

2.నార్మల్ గా కుకింగ్ చేసే విధానంలో కంటే,.. ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల.. పోషక విలువలన్నీ ఎక్కడికీ పోవు. అందులోనే ఉంటాయి.  

3.ఇక.. ఎలాంటి వంట కు అయినా..ఫ్లేవర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే... నార్మల్ గా వంట చేసే సమయంలో ఎక్కువగా.. ఫ్లేవర్స్ స్మెల్ రూపంలో బయటకు పోతాయి. కానీ.. ప్రెజర్ కుక్కర్ లో మాత్రం ఎక్కువ సేపు అందులోనే ఫ్లేవర్స్ ఉండిపోతాయి. కాబట్టి.. ఎక్కువ సేపు చేసిన వంట సువాసనలతో నిండి ఉంటుంది. అది రుచిని కూడా పెంచుతుంది.

pressure cooker

4. ఇక.. ప్రెజర్ కుక్కర్ లో వంట అంటే... అది వన్ పాట్ కుకింగ్ అవుతుంది. క్లీనింగ్ కి కూడా పెద్ద కష్టమేమీ ఉండదు. ఇన్ని గిన్నెలు, గంటలు అంటూ ఎక్కువగా అవ్వవు. సింపుల్ కుక్కర్ ఒక్కటి కడుక్కుంటే సరిపోతుంది.

5.ప్రెజర్ కుక్కర్ లో వంట చేస్తే.. మన ఎనర్జీ ఎక్కడికీ పోదు. మన ఎనర్జీ చాలా వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ కూడా ఎక్కువగా వృథా అవ్వదు.. దీని వల్ల మనం మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు.

ప్రెజర్ కుక్కర్ లో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు చూద్దాం..
1.ఇక ప్రెజర్ కుక్కర్ వంట వల్ల ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే.. కుక్కర్ లో ఏం వండినా కూడా.. సమయం ఒకేలా పడుతుంది. ఫుడ్ రెసిపీని పట్టి... టైమ్ మారదు. ముందు ఆఫ్ చేసినా.. ఆవిరి  మొత్తం పోయేంత వరకు ఆగాల్సిందే.

2. నార్మల్ గా మనం వంట చేసుకుంటే.. కూర సరిగానే ఉడుకుంటుందా..? ఇంకా అందులో ఏమైనా అవసరంర అవుతాయా అనే విషయం మనకు తెలుస్తుంది. కానీ.. ప్రెజర్ కుక్కర్ లో అలా తెలీదే. మొత్తం అయిపోయి.. ఆవిరిపోయి.. ఓపెన్ చేసి చూసే వరకు అది సరిగానే అయ్యిందా లేదా అనే క్లారిటీ కూడా మనకు ఉండదు.
 

3. ఇక ప్రెజర్ కుక్కర్ లో మనం అన్ని రకాల వంటలు చెయ్యలేం.. ఏదైనాఫ్రై, రోస్టింగ్ లాంటివి చేయడానికి వీలుపడదు.  ఇక.. ఒక్క విజిల్ ఎక్కువ  వచ్చినా.. కుక్కర్ లోపల ఉండే ఫుడ్ మరీ మెత్తగా అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి.  ఒక్కోసారి మాడిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఇక ప్రెజర్ కుక్కర్లు సరిగా శుభ్రం చేయకపోతే.. ఒక్కోసారి అవి పేలిపోతూ కూడా ఉంటాయి. కాబట్టి.. వీటిని వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

Latest Videos

click me!