కేలరీలు తక్కువగా ఉంటాయి
అన్నం, చపాతీ, దోశ, పూరీ వంటి వంటకాలతో పోలిస్తే ఇడ్లీలోనే కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అన్నింటికంటే ఇడ్లీనే చాలా సులువుగా జీర్ణం అవుతుంది.
అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ఇడ్లీని తింటే మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ఇది మన గట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇడ్లీ బాగా సహాయపడుతుంది.
ఇడ్లీలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి. అంటే దీన్ని తింటే మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. ఇడ్లీని తింటే మీరు అనవసరమైన స్నాక్స్ ను ఎక్కువగా తినకుండా ఉంటారు.
ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. ఇడ్లీలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే ఇది మీ శరీరాన్ని బలంగా, హెల్తీగా ఉంచుతుంది.