ప్రస్తుతం మార్కెట్లో టీ పొడి రూపంలోనూ... ఆకుల రూపంలో రెండు విధాలుగా అందుబాటులో ఉంది. చాలా మంది ప్రజలు సాంప్రదాయ ఆకుతో కలిపిన టీని ఇష్టపడతారు, కొంతమంది టీ బ్యాగ్‌లను ఇష్టపడతారు, ఎందుకంటే దానికోసం పెద్దగా కష్టపడేది ఉండదు.
టీ ని చాలా దేశాల్లో ఓ డ్రింక్ లాగా తీసుకుంటారు. కానీ.. మన దేశంలో మాత్రం టీ ఒక ఎమోషన్. టీ మన దేశ సంస్కృతిలో ఎప్పుడో భాగమైపోయింది. ఉదయాన్నే లేవగానే.. కమ్మని వేడి వేడి టీ కళ్ల ముందు ఉంటే.. దానిని తాగుతుంటే కలిగే అనుభూతే వేరు. మనలో చాలా మంది భోజనం లేకపోయినా ఉంటారేమో తెలీదు కానీ... టీ తాగకుండా ఉండలేరు. కచ్చితంగా ఉదయం, సాయంత్రం టీ తాగుతారు. అయితే.. టీ పొడి వాడటం కరెక్టా.. లేదంటే.. టీ ఆకులు వాడటం ఉత్తమమా..? ఈ రోజు ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా.. ఎలాంటి టీ తాగడం ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
25
International Tea Day 2022-
ప్రస్తుతం మార్కెట్లో టీ పొడి రూపంలోనూ... ఆకుల రూపంలో రెండు విధాలుగా అందుబాటులో ఉంది. చాలా మంది ప్రజలు సాంప్రదాయ ఆకుతో కలిపిన టీని ఇష్టపడతారు, కొంతమంది టీ బ్యాగ్‌లను ఇష్టపడతారు, ఎందుకంటే దానికోసం పెద్దగా కష్టపడేది ఉండదు. కాబట్టి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. మరి వీటిలో దేనిని వాడితే బెటరో ఇప్పుడు చూద్దాం.
35
Tea Powder
టీ పొడి.. ఇది టీ లోయెస్ట్ గ్రేడింగ్. విరిగిన ఆకులను పొడి చేసి టీ పొడి తయారు చేస్తారు. దీనినే టీ బ్యాగుల్లోనూ వాడతారు. అయితే.. వీటిని తరచూ ఉపయోగించలేం. ఒక్కసారి మాత్రమే వాడగలం.
45
tea powder
tea powderఆకుల టీ: దీనిని చెక్కు చెదరని ఆకులతో చేస్తారు. వీటితో టీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. టీ అసలైన రుచిని ఇవి అందించగలుగుతాయి.
55
Tea
రుచి విషయంలో టీ పౌడర్ కన్నా కూడా... ఆకుల తో చేసే టీ చాలా రుచి ఎక్కువగా ఉంటుంది. అసలైన టీ రుచి చూడాలంటే... టీ డ్యాగులు, టీ పౌడర్లు కాకుండా... హోల్ టీ లీఫ్ ని వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.