మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఈ మామిడి పండు రుచి చూడటం కోసం.. సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం. కేవలం వేసవికాలంలో మాత్రమే లభించే ఈ మామిడి పండ్లు తినడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. ధర ఎంత ఎక్కువ ఉన్నా.. కనీసం ఒక్క పండు అయినా తినాలని అనుకుంటూ ఉంటారు.
Mangoes
అయితే... ఈ మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో.. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కమ్మని, తియ్యని పండ్లను ఎంచుకోవచ్చట. మరి ఆ ట్రిక్స్ ఏంటో మనమూ తెలుసుకుందామా..
చాలా సార్లు పైన రంగు చూసి మామిడి పండింది అనుకొని మనం పొరపాటు పడిన సందర్భాలు చాలానే ఉండి ఉంటాయి. అయితే.. ఒక చిన్న టెక్నిక్ తో అది పండినదో కాదో తెలుసుకోవచ్చట. ముందుగా పండుని చేతిలోకి తీసుకోవాలి. పండిన మామిడి పండు స్మూత్ గా ఉంటుంది.
Mangoes
పండనిది దృఢమైన చర్మంతో ఉంటుంది. అన్ని వైపుల నుండి సున్నితంగా పరిశీలించండి మరియు అన్ని వైపుల నుండి మృదువైన మరియు ఎటువంటి పంక్చర్లు లేదా కోతలు లేని మృదువైన మామిడి పండ్లను ఎంచుకోండి.
మామిడి పండిందో తెలుసుకోవడానికి మరో పరీక్ష వాసన చూడటం. పూర్తిగా పండిన మామిడి ఎల్లప్పుడూ కాండం దగ్గర బలమైన, తీపి వాసన కలిగి ఉంటుంది, అయితే పండని వాటికి ఎక్కువ వాసన రాదు. పుచ్చకాయలు, పైనాపిల్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది.
Mangoes
ఇక చాలా మంది రంగును చూసి పండును కొంటారు. అయితే.. నిజానికి రంగును పట్టి పండు పండిందో లేదో తెలుసుకోలేమట. ఎందుకంటే.. మామిడిలో చాలా రంగులు ఉంటాయి. రంగు చూసి నిజంగా పండిందో లేదో చెప్పడం కష్టమట. రంగు రావడం కోసం చాలా మంది వ్యాపారులు మందులువాడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇక మార్కెట్లో నుంచి కొనుగోలు చేసిన తర్వాత.. మామిడి పండ్లను నీటిలో కాసేపు నానపెట్టి.. ఆ తర్వాత మాత్రమే తినాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇలా తినడం వల్ల మామిడి నుండి వేడిని తొలగించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లను నానబెట్టకుండా తినడం వల్ల లూజ్ మోషన్స్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పండిన మామిడి పండ్లను నిల్వ చేయడానికి మరియు వాటి పండే ప్రక్రియను మందగించడానికి ఉత్తమ మార్గం వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయడం. పండిన మామిడి పండ్లు ఫ్రిజ్‌లో కనీసం 4-5 రోజులు తాజాగా ఉంటాయి.
Mango
మీరు ఇంకా కొంచెం పండని మామిడి పండ్లను కొనుగోలు చేసినట్లయితే, వాటిని పేపర్ బ్యాగ్ లేదా వార్తాపత్రికలో చుట్టి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. ఇది వారి పండిన ప్రక్రియను వేగవంతం చేస్తుంది, వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.