Health Benefits of Pink Salt
మనం ఎంత గొప్ప వంట చేసినా.. అందులో ఉప్పు లేకపోయినా.. రుచికి తగినంత సరిపోక పోయినా.. ఆ వంట తినలేం. కనీసం రుచిగా కూడా అనిపించదు. మనం చేసే వంటకు ఉప్పు రుచిని తెస్తుంది. అంతేకాదు.. మన శరీరానికి సరిపడా అయోడిన్ అందాలన్నా కూడా ఉప్పు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతుంటారు. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఉప్పు వల్ల అనేక సమస్యలు కూడా ఉన్నాయి. మనం వాడే ఉప్పు కాకుండా.. ఈ మధ్య పింక్ సాల్ట్ పేరిట ఉప్పు మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ పింక్ సాల్ట్ ని జనాలు ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టారు. అసలు ఏంటి ఈ పింక్ సాల్ట్. దీని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..
himalayan pink salt
పింక్ సాల్ట్ చూడడానికి సాధారణ రాళ్ల ఉప్పులానే కనిపిస్తుంది. అయితే ఇది లేత గులాబీ రంగులో ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడమే. ఈ ఉప్పుకి ఉన్న రంగు కారణంగానే చాలామంది దీనిని పింక్ సాల్ట్ అని పిలుస్తారు. అలాగే ఇది హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి దీన్నే హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు.
సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, మిగత రకాల ఉప్పులతో పోల్చి చూస్తే ఈ ఉప్పు చాలా స్వచ్ఛమైందనీ చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇందులో ఉండే సోడియం కాస్త తక్కువగానే ఉంటుంది. అందుకే చాలామంది దీనిని సూప్‌లు, సలాడ్స్‌లో భాగం చేసుకుంటూ ఉంటారు.
See what benefits this Pink Salt can have
రసాయనికంగా సాధారణ ఉప్పుతో ఇందుప్పుని పోల్చి చూస్తే.. ఇందులో 98% సోడియం క్లోరైడ్ ఉంటుంది. దీంతో పాటు ఖనిజ లవణాలైన పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం.. మొదలైనవి కూడా ఇందులో కొద్ది మోతాదుల్లో ఉంటాయి. పింక్ సాల్ట్ నారింజ రంగులో కనిపించడానికి గల కారణం కూడా ఇదే. రుచిలో కూడా మిగతా ఉప్పులతో పోలిస్తే ఇందుప్పు భిన్నంగా ఉండడానికీ ఇదే కారణం.
See what benefits this Pink Salt can have
సోడియం ఒక్కటే కాకుండా పింక్ సాల్ట్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటి ఎన్నో మినరల్స్ ఉన్నాయి. అందువల్లనే సాధారణ ఉప్పు కంటే పింక్ సాల్ట్ ఎంతో మంచిది. ఈ పింక్ సాల్ట్ శరీరంలోనించి చెడు పదార్ధాలని తొలగించి, నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుందని అంటారు. వేసవి పానీయాలలో కూడా ఈ సాల్ట్ ని ఉపయోగిస్తారు. ఇవి శరీరంలోని సోడియం స్థాయిలని అదుపులో ఉంచి, అతిదాహం కాకుండా చేస్తాయి. రక్తపోటుని నియంత్రించడానికీ, హార్మోన్ల స్థాయిలను సమతూకంలో ఉంచడానికీ, అరుగుదలకీ పింక్ సాల్ట్ ఉపయోగపడుతుందని అంటారు.
Health Benefits of Pink Salt
ఈ పింక్ సాల్ట్.. ఆరోగ్యానికి మాత్రమేకాదు.. అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉప్పులో డీటాక్సిఫికేషన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరం లోపల ఉండే టాక్సిన్స్‌ని ఇది సులభంగా బయటకు పంపించగలదు. ముఖ్యంగా చర్మకణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా.. వంటి వాటిని లోతు నుంచీ శుభ్రం చేసి చర్మం లోపల నుంచి మెరిసేలా చేస్తుంది.