భోజనంలో అంచుకు ఏదో ఒక పచ్చడి లేకుంటే ముద్దు దిగదు చాలామందికి. మామిడికాయ పచ్చడి, చింతకాయపచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమాటాపచ్చడి లాంటి రెగ్యులర్ నిల్వ పచ్చళ్లలతో పాటు ఎన్నో రకాల రోటిపచ్చళ్లు మనకు తెలుసు.
వీటిని ఇంట్లో తయారుచేసుకునేవాళ్లు కొంతమందైతే నేటి బిజీలైఫ్ లో టైం లేక మార్కెట్లో రెడీమేడ్ పచ్చళ్లు కొనేవాళ్లు చాలామంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైటి ఫుడ్స్ అంత మంచివి కాదు. మరెలా అంటే మీలాంటి వాళ్ల కోసమే ఈ కొత్తరకం ఇన్ స్టాంట్ పచ్చళ్లు.
నిల్వ పచ్చళ్ల కోసం నెలల తరబడి వెయిట్ చేసి మీ నాలుక రుచిని చంపుకోవాల్సిన పనిలేదు. ఎంచక్కా అందుబాటులో ఉన్న కూరగాయలతో 24 గంటల్లో రుచికరమైన పచ్చళ్లను మీరే స్వయంగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు.
వెనిగర్, ముల్లంగి పచ్చడి...ఈ ఇన్ స్టాంట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 3-4 ముల్లంగి, 2 కప్పుల వెనిగర్, 4 పచ్చిమిరపకాయలు.తయారు చేసే విధానం :ముల్లంగి తొక్కుతీసి సన్నని ముక్కలుగా తరగాలి. తరువాత శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకుని ముక్కల మీద వెనిగర్ పోయండి. తరువాత పచ్చమిరపకాయలు సన్నగా తరిగి ఇందులో కలపండి.ఆ తరువాత గాజు సీసా మూత గట్టిగా బిగించి ఆరుగంటల పాటు ఎండలో పెట్టండి. అంతే టేస్టీ టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది. మామూలుగా బైట ఉంచితే రెండు వారాల దాకా తాజాగా ఉంటుంది.
వెనిగర్, ముల్లంగి పచ్చడి...ఈ ఇన్ స్టాంట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 3-4 ముల్లంగి, 2 కప్పుల వెనిగర్, 4 పచ్చిమిరపకాయలు.తయారు చేసే విధానం :ముల్లంగి తొక్కుతీసి సన్నని ముక్కలుగా తరగాలి. తరువాత శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకుని ముక్కల మీద వెనిగర్ పోయండి. తరువాత పచ్చమిరపకాయలు సన్నగా తరిగి ఇందులో కలపండి.ఆ తరువాత గాజు సీసా మూత గట్టిగా బిగించి ఆరుగంటల పాటు ఎండలో పెట్టండి. అంతే టేస్టీ టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టుకుంటే నెల రోజులపాటు నిల్వ ఉంటుంది. మామూలుగా బైట ఉంచితే రెండు వారాల దాకా తాజాగా ఉంటుంది.
ఆవపిండి క్యారెట్ పచ్చడి..తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 5 క్యారెట్లు, 5 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 2 టీస్పూన్ల ఉప్పు.
తయారు చేసే విధానం :క్యారెట్ బాగా శుభ్రంగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసి గాజు సీసాలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు, నల్లమిరియాలు, ఉప్పు ను ఒక మిక్సీలో కొద్దిగా బరుకుగా పొడి చేసుకోవాలి.ఈ పొడిని క్యారెట్ ముక్కల జార్ లో వేసి మూతపెట్టి బాగా షేక్ చేయాలి. క్యారెట్ ముక్కలకు ఆవపిండి బాగా పట్టేవరకు షేక్ చేయాలి. తరువాత ఈ గాజుసీసాను 6 నుంచి 8 గంటలపాటు ఎండలో పెట్టాలి. ఈ మిశ్రమానికి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా కలుపుకోవచ్చు.ఎనిమిది గంటల తరువాత క్యారట్ లోని నీరు బైటికి వస్తుంది. అప్పుడు పచ్చడి రెడీ అయినట్టు. దీన్ని అన్నం, టిఫిన్స్ లతో తినేయడమే. ఈ పచ్చడి బైట అయితే వారం పాటు తాజాగా ఉంటుంది. ప్రిడ్జ్ లో పెడితే 2,3వారాల వరకు నిల్వ ఉంటుంంది.
ఇన్ స్టాంట్ అల్లం పచ్చడి..తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాముల అల్లం, 1 టీస్పూన్ ఉప్పు, 3 కాయల నిమ్మ రసం, 2 పచ్చిమిర్చి.
తయారు చేసే విధానం : అల్లాన్ని శుభ్రంగా కడిగి, తొక్కు తీసి సన్న ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని ఓ శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు కలిపి పదిహేను నిముషాల పాటు పక్కన పెట్టేయాలి. అల్లం కొంచెం మెత్త బడ్డాక, మిరపకాయలను సన్నగా తరిగి దీనికి కలపాలి. ఆ తరువాత నిమ్మరసం కలిపి 2,3 గంటలపాటు పక్కన పెట్టి ఊరనివ్వాలి. లేదంటే అల్లం లేత గులాబీ రంగులోకి మారేంత వరకు అలాగే ఉంచాలి.లేత గులాబీ రంగులోకి మారిందంటే పచ్చడి తినడానికి రెడీ అయినట్టే. ఇది ప్రిడ్జ్ లో పెడితే 2 వారాల పాటు తాజాగా ఉంటుంది.
ఉల్లిపాయ నిల్వపచ్చడి..తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 1 పెద్ద ఉల్లిపాయ, ¾ కప్పు నీరు, ½ కప్పు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టీస్పూన్ ఉప్పు.
ఉల్లిపాయ నిల్వపచ్చడి..తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 1 పెద్ద ఉల్లిపాయ, ¾ కప్పు నీరు, ½ కప్పు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టీస్పూన్ ఉప్పు.తయారు చేసే విధానం : ఉల్లిపాయను సన్నటి, పొడగాటి ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సాస్ పాన్ లో నీళ్లు, వెనిగర్, చక్కెర, ఉప్పు వేడి చేయాలి. ఈ మిశ్రమం కలిసిపోయాక చల్లారబెట్టాలి.చల్లారిన ఈ మిశ్రమాన్ని జార్ లోని ఉల్లిపాయ ముక్కల మీద పోసి కలపాలి. ఆ తరువాత సీసా మూత బిగించి ఆరు గంటలపాటు అలాగే ఉంచాలి. అంతే నోరూరించే ఉల్లినిల్వ పచ్చడి రెడీ. ఇది ప్రిడ్జ్ లో పెట్టుకునే 2,3 వారాల పాటు తాజాగా ఉంటుంది.
పచ్చిమామిడికాయ పచ్చడితయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : 2 పచ్చి మామిడికాయలు, ¼ టీస్పూన్ పసుపు, ½ టీస్పూన్ పొడి కారం, రుచికి సరిపడా ఉప్పు.
తయారు చేసే విధానం : మామిడికాయలను శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసి ఓ శుభ్రమైన గాజు సీసాలోకి తీసుకోవాలి. ఈ ముక్కలకు పసుపు, కారంపొడి, ఉప్పు బాగ పట్టేలా కలపాలి.ఆ తరువాత గాజుసీసాను 8-10 గంటల పాటు పక్కన పెట్టాలి. అంతే ఆకలిని పెంచే పచ్చిమామిడి ఇన్ స్టాంట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని ప్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.