రెస్టారెంట్ స్టైల్ ప్లఫ్పీ ఆమ్లెట్ ఇంట్లోనే .. ఇలా తయారు చేసుకోండి..

First Published | Feb 12, 2021, 1:43 PM IST

గుడ్డుకొట్టి పెనంమీద వేస్తే ఆమ్లెట్ అవుతుంది. కానీ దాని అసలు రుచి రావాలంటే మాత్రం ఇది సరిపోదు. దీనికోసం కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. మెత్తగా, ఉబ్బిన ఆమ్లెట్ రావాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాలి.

గుడ్డుకొట్టి పెనంమీద వేస్తే ఆమ్లెట్ అవుతుంది. కానీ దాని అసలు రుచి రావాలంటే మాత్రం ఇది సరిపోదు. దీనికోసం కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. మెత్తగా, ఉబ్బిన ఆమ్లెట్ రావాలంటే కొన్ని టిప్స్ తెలుసుకోవాలి.
నిజానికి ఆమ్లెట్ వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. నెపోలియన్ బోనపార్టే ఆయన సైన్యంతో కలిసి వెడుతున్నప్పుడు.. ప్రెంచ్ ప్రాంతంలో రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సైన్యం కోసం స్థానికులు ఆమ్లెట్ ను తయారు చేశారు.

ఆ రుచికి నెపోలియన్ ఫిదా అయిపోయాడట. అంతే స్థానికంగా ఉన్న గుడ్లన్నీ తీసుకొచ్చి తన సైన్యం కోసం భారీ ఆమ్లెట్ తయారు చేయాలని సూచించాడట. ఆమ్లెట్ అనేది ఫ్రెంచ్ పదం.. ఇది 16వ శతాబ్దంనుండి వాడుకలోకి వచ్చిందని చెబుతారు.
అయితే ఈ విషయం చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. కానీ ఆమ్లెట్ ను ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. ప్రతీ దేశంలో ఆమ్లెట్ తయారు చేసే ప్రత్యేక పద్ధతి ఒకటుంటుంది.
ఫ్రెంచ్ ఆమ్లెట్ మెత్తగా, ఉబ్బినట్టుగా ఉండి బాగా బ్రౌన్ కలర్లోకి మాడ్చకుండా ఉంటుంది. దీనికి టమాటాలు, రకరకాల ఆకుకూరలు వేసి చేస్తారు. ఇక మన దేశ ఆమ్లెట్ లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి కారంగా తయారు చేస్తారు.
ఇరాన్‌లో నర్గేసి లేదా బచ్చలికూర ఆమ్లెట్ ఫేమస్. ఇటాలియన్ ఆమ్లెట్ ను ఫ్రిటాటా అని పిలుస్తారు. దీన్ని కూరగాయలు, జున్ను బాగా వేసి తయారు చేస్తారు. పాస్తా కూడా వేస్తారు. తమగోయాకి అనేది సాంప్రదాయ జపనీస్ ఆమ్లెట్. ఇందులో మిరిన్, సోయా సాస్, బోనిటో ఫ్లేక్స్ ఉంటాయి. ఇక స్పానిష్ ఆమ్లెట్‌లో బంగాళాదుంపలు వేస్తారు. ఇక యూఎస్ ఆమ్లెట్లలో హామ్ ను కలుపుతారు.
ఇన్ని రకాల ఆమ్లెట్లలో మనకు నచ్చిన చక్కటి ఆమ్లెట్ చేసుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ప్రాసెస్ అంతా సరిగ్గా ఉండాలి. ఫ్లిప్ చేసేప్పుడు విరిగిపోకుండా రావాలి. గిలకొట్టడం సరిగా ఉండాలి.
ఆమ్లెట్ వేయడంలో అతి ముఖ్యమైనది అందులో వేయాలనుకున్న పదార్థాలను కట్ చేయడం. ఆమ్లెట్ కు జోడించే పదార్థాలు మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. వీటిల్లో తేడా వస్తే ఆమ్లెట్ మాడిపోవడమో, మెత్తబారి రుచి తగ్గిపోవడమో జరుగుతుంది.
ఇక ఆమ్లెట్ వేయడానికి కావాల్సిన పదార్థాలు.. ఒక ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 1 టమోటా ఇష్టాన్ని బట్టి, 1 కొత్తిమీర కట్ట కావాల్సి ఉంటుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి.. పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు 3 గుడ్లను ఒక గిన్నెలో కొట్టిపోయండి. ఆ తరువాత బాగా విస్క్ చేయాలి. మధ్యలో రుచికి ఉప్పు, ఒక చిటికెడు మిరియాలు పొడి కలపాలి. దీనికి 2 స్పూన్ పాలు కూడా కలపాలి. పాలు ఆమ్లెట్ కు మెతదనాన్ని ఇస్తుంది. ఇవి కలపడం అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసి మరింత బాగా కలపాలి.
ఇప్పుడు తయారీ విధానం.. ఒక పాన్ వేడి చేసి రెండు మూడు టీస్పూన్లు నూనె, వెన్న లేదా నెయ్యి వేయండి. నూనె వేడెక్కాక స్టౌ మంట తగ్గించాలి. ఆ తరువాత ఆమ్లెట్ మిశ్రమం వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. ఆమ్లెట్ మీద మూతపెట్టడం వల్ల మెత్తగా, పొంగిన ఆమ్లెట్ తయారవుతుంది.
కాసేపయ్యాక ఆమ్లెట్ ను గరిటెతో తిప్పి రెండోవైపు వేయాలి. ఇలా తిప్పేప్పుడు విరగకుండా చూసుకోవాలి. ఆమ్లెట్ పూర్తిగా ఉడికితే విరగదు. అది గుర్తుంచుకోవాలి. అంతే చక్కటి ఆమ్లెట్ రెడీ అయిపోతుంది.
అయితే కొంతమంది ఛీజ్ ఆమ్లెట్ ఇష్టపడతారు. అయితే ఆమ్లెట్ కు ఛీజ్ ఎప్పుడు కలపాలో తెలిసి ఉండాలి. ఒకవేళ మీరు క్రీము చీజ్ ఉపయోగించినట్లైతే.. ఆమ్లెట్ ను తిప్పి నప్పుడు దానిమీద వేసి మడతపెట్టాలి. అప్పుడు ఛీజ్ బాగా కరుగుతుంది.
చాలామంది గుడ్డు కొట్టేటప్పుడే ఛీజ్ కలుపుతారు. ఇది సరైన పద్ధతి కాదు. దీనివల్ల ఆమ్లెట్ విరిగిపోతుంది. ఒకవేళ తురిమిన ఛీజ్ ను కలపాలనుకుంటే ఆమ్లెట్ కాస్త ఉడుకుపట్టగానే కలిపి ఆమ్లెట్‌ మీద మూతపెట్టి, తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.

Latest Videos

click me!