ఈ టమాటాలను ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని రోగాలు రాకుండా చేస్తాయో..!

First Published | Aug 14, 2023, 2:53 PM IST

సైజులో అచ్చం చెర్రీలా కనిపించే చెర్రీ టమాటాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి సాధరణంగా టమాటాల మాదిరిగా ఎర్ర రంగులో ఉంటాయి. కానీ ఇవి నారింజ, పసుపు, ఆకుపచ్చ, ఊదా, నల్ల  రంగుల్లో కూడా ఉంటాయి. 
 

మనలో చాలా మందికి చెర్రీ టమాటాల గురించి అసలే తెలియదు. ఇక ఇవి మనకు చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలియదు. సైజులో అచ్చం చెర్రీల్లా కనిపించే ఈ టమోటాలు లేత గోళాకారంలో ఉంటాయి. అవి సాధారణంగా సాధారణ టమోటాల మాదిరిగా ఎర్రగా ఉంటాయి. కానీ ఇవి నారింజ, పసుపు, ఆకుపచ్చ, ఊదా, నలుపు రంగులలో కూడా ఉంటాయి. చెర్రీ టమోటాల రంగు రూపం గురించి వదిలేస్తే వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. 
 

చెర్రీ టమాటాల్లో ఉండే పోషకాలు 

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. చెర్రీ టమాటాలలో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. వీటిలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, సోడియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇనుము, పొటాషియం, భాస్వరం, మాంగనీస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అసలు ఈ చెర్రీ టమాటాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 


గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా..

పబ్మెడ్ సెంట్రల్ ప్రకారం.. చెర్రీ టమాటాల్లో ఉండే మొక్కల సమ్మేళనాలు రక్త నాళాల గోడను రక్షిస్తాయి. అలాగే హృదయ సంబంధ సమస్యలను నివారిస్తాయి. అంతేకాదు వీటిలో ఉండే లైకోపీన్ మీ శరీరం ఎంత కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందో? ఎంత కొవ్వును నిల్వ చేస్తుందో నిర్ధారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రెండు కారకాలు చాలా ముఖ్యమైనవి. దీనితో పాటుగా దీనిలో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం కొవ్వు జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అధ్యయనం ప్రకారం.. ఫినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 
 

చర్మానికి.. 

వయసు పెరుగుతున్న కొద్దీ సూర్యకిరణాల హానికరమైన ప్రభావంతో చర్మం పొడిబారడం, పిగ్మెంటేషన్ పెరగడం, ముడతలు కనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇది ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో కెరోటినాయిడ్, పాలీఫెనాల్, యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మంపై సూర్య కిరణాల హానికరమైన ప్రభావాలు తగ్గుతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చెర్రీ టమాటాలు ఈ పోషకాల నాణ్యతను కలిగి ఉంటాయి.
 

యాంటీ క్యాన్సర్ లక్షణాలు..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చెర్రీ టమాటాలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ముఖ్యంగా  రొమ్ము , ప్రోస్టేట్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తాయి. 2013 లో ప్రచురించబడిన ఒక సమీక్ష ప్రకారం.. తగినంత మొత్తంలో చెర్రీ టమాటాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించొచ్చు. 
 

ఎముకలను బలోపేతం.. 

చెర్రీ టమాటాల్లో ఉండే లైకోపీన్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మహిళలు బోలు ఎముకల వ్యాధికి ఎక్కువగా గురవుతారు. కాబట్టి వీటిని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. చెర్రీ టమాటాలను క్రమం తప్పకుండా తినే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే ఎముక సాంద్రత కోల్పోయే ప్రమాదం తక్కువ.
 


వ్యాధి రక్షణ..

చెర్రీ టమాటాల్లో ఉండే సమ్మేళనం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి అనేది యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ అసమతుల్య. ఇది క్యాన్సర్, డయాబెటిస్, గుండె, మూత్రపిండాల వ్యాధులను కలిగిస్తుంది. చెర్రీ టమోటాలలో ఉండే నారింజిన్, నారింజెనిన్ అటువంటి రెండు సమ్మేళనాలు ఎన్నో ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ ఫ్లేవనాయిడ్లు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా పనిచేస్తాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, వ్యాధులతో పోరాడటానికి మరింత ప్రభావవంతంగా చేస్తుంది. 
 

Latest Videos

click me!