ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చనిపోతుంది
ఫ్రిజ్ లో ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. దీనికి పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చనిపోతుంది. దీనివల్ల పెరుగులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరుగును గడ్డకట్టించడానికి సహాయపడుతుంది. అయితే పెరుగును ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది సరిగా గడ్డకట్టదు. అందుకే చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టకూడదని నిపుణులు చెప్తారు.
పెరుగు నాణ్యత తగ్గుతుంది
పెరుగును ఫ్రిజ్ లో పెడితే దాని నాణ్యత కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగును ఫ్రిజ్ లో పెడితే దాని రుచి, ఆకృతి మారుతుంది. అంతేకాదు పెరుగులో ఉండే పోషకాలు కూడా తగ్గుతాయి. చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెడితే అది పెరుగు నాణ్యతపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.