
చాలా మంది రోజుకు మూడు పూటలా రైస్ నే తింటుంటారు. ఎందుకంటే అన్నం తింటేనే కడుపు నిండుగా అనిపిస్తుంది. అలాగే శరీరం శక్తివంతంగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే తింటుంటారు. బరువు తగ్గాలనుకునేవారు మాత్రమే ఇలా ఎక్కువగా చేస్తుంటారు. ఇంకొంతమంది అన్నం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఉదయం, రాత్రి వేళల్లో అన్నానికి బదులుగా వేరే ఫుడ్ ను తింటుంటారు.
నిజం చెప్పాలంటే వైట్ రైస్ లో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఎక్కువగా ఉండవు. అందులోనూ అన్నాన్ని ఎక్కువగా తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. అంతేకాదు అన్నం షుగర్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అన్నాన్ని తింటే రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు వైట్ రైస్ ను తినకూడదని చెప్తారు. ఇకపోతే మీరు ఒక నెల పాటు అన్నం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
నెల పాటు అన్నం తినకపోతే ఏమౌతుంది?
అన్నం తినకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
బరువు తగ్గుతారు
బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే అన్నాన్ని తింటే మీరు బరువు బాగా పెరుగుతారు. అదే అన్నం మానేసారనుకో ఈజీగా బరువు తగ్గుతారు. అన్నం మీ బరువును పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి అన్నం తినడం మానేస్తే మీరు బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒకటి రెండు సార్లు అన్నాన్ని తింటే బరువు తగ్గుతారు. నెలపాటు అన్నం తినకపోతే కూడా బాగా బరువు తగ్గుతారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్
అన్నం డయాబెటీస్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అన్నాన్ని తింటే వీరి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఇది వీరి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే వీళ్లు అన్నం తినడం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది
బియ్యంలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒకవేళ మీరు అన్నం తినడం మానేస్తే మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో మీకు మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావు.
అన్నం తినకపోవడం వల్ల వచ్చే సమస్యలు
శక్తి ఉండదు
అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవే మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు. అన్నం తింటే మనం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. అదే అన్నం తినడం మానేస్తే మన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. ఎప్పుడూ నీరసంగా, బలహీనంగా ఉంటారు. అన్నం తినకపోవడం వల్ల వచ్చే ప్రధాన సమస్య ఇది.
ప్రోటీన్ లేకపోవడం
నిజం చెప్పాలంటే అన్నంలో ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మీరు గనుక అన్నాన్ని తినడం మానేస్తే మీలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది.
విటమిన్లు, మినరల్స్ లోపం:
బియ్యంలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు గనుక అన్నాన్ని తినడం మానేస్తే మీ శరీరంలో విటమిన్లు, ఖనిజాలు లోపిస్తాయి. అందుకే అన్నం తినడం మానేయడానికి ముందు మీ డాక్టర్ లేదా పోషకాహార నిపుణులను ఖచ్చితంగా సంప్రదించాలి. అన్నం తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో వారు వివరంగా చెప్తారు.