ఇడ్లీ Vs దోశ.. తయారీ విధానాలు..
1.ఇడ్లీ…
దీనిని తయారు చేసే విధానం అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిరి మీద ఉడికిస్తారు. చాలా మృదువుగా ఉంటాయి. చిన్న పిల్లలకు అయినా సులభంగా జీర్ణం అవుతుంది. ఈ ఇడ్లీ తయారు చేయడానికి మనం ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదు. ఆహారం లైట్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇడ్లీని ప్రిఫర్ చేయవచ్చు.
2.దోశ..
దోశను ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.పలచగా, క్రిస్పీగా ఉంటుంది. నెయ్యి లేదంటే నూనెతో దీనిని కాలుస్తారు. ఇడ్లీతో పోలిస్తే.. క్యాలరీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మసాలా దోశ, రవ్వ దోశ ఇలా ఐటెమ్ మారుతున్న కొద్దీ..క్యాలరీలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.