వీటితో అన్నం కమ్మగా అవుతుంది

First Published | Nov 30, 2024, 10:13 AM IST

మనలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అయితే సాదా రైస్ తింటే కొంతమంది ముఖం వాపు వస్తే మరికొంతమందికి జలుబు చేస్తుంది. అయితే అన్నంలో కొన్నింటిని కలిపి తిన్నారంటే ఈ సమస్యలూ రావు. అన్నం టేస్టీగా కూడా ఉంటుంది. 

అన్నం కమ్మగా ఏంటీ, దీనికి ఒకే రుచి ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నిజానికి అన్నాన్ని కూరలు లేకుండా తినడం కష్టం. కానీ కొన్ని పదార్థాలు సాదా రైస్ ను కూడా కమ్మగా చేయొచ్చు.  అయితే సాదా అన్నాన్ని అలాగే తింటి చలికాలంలో చాలా మందికి ముఖం వాపు వస్తుంది. మరికొంతమందికి అయితే ఏకంగా జలుబు కూడా చేస్తుంది. కానీ కొన్ని పదార్థాలు అన్నం రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందుకే సింపుల్ రైస్ ను రుచికరమైన అన్నంగా ఎలా చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పసుపు అన్నం

పసుపు అన్నం కూడా రుచిగా ఉంటుంది. ఇందుకోసం మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. అన్నం వండేటప్పుడు దానిలో కొంచెం పసుపును వేసి కలపండి. ఈ అన్నాన్ని రాత్రిపూట తినండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలిపెట్టడాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం మీరు అన్నం వండేటప్పుడు దానిలో ఒక టీస్పూన్ పసుపును, రుచికి సరిపడా కొంచెం ఉప్పును వేసి కలపండి. అలాగే  జీలకర్ర, నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇది అన్నం టేస్ట్ ను మరింత పెంచుతుంది. ఈ అన్నాన్ని రాజ్మా, ఆలుగడ్డ కూరతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. 


rice

మసాలా దినుసులు

మసాలా దినుసులతో వైట్ రైస్ ను మంచి వాసన వచ్చేలా, కమ్మగా చేయొచ్చు. మసాలా దినుసుల్లో వేడి చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి ఈ రైస్ ను తింటే మీకు చలి తక్కువగా పెడుతుంది. లోపలి నుంచి మీ శరీరం వెచ్చగా ఉంటుంది. ఇందుకోసం మసాలా దినుసులను నెయ్యిలో లేదా నూనెను వాసన వచ్చే వరకు వేయించండి. వీటిని బియ్యంలో వేసి ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత దానిపైన దాల్చినచెక్క, లవంగాలు లేదా నల్ల మిరియాలను కూడా వేసేకోవచ్చు. దీన్ని గ్రిల్డ్ వెజిటేబుల్స్ తో తింటే రుచి బాగుంటుంది. 
 

లెమన్ రైస్

లెమన్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే అన్నంలో ఒకటి లేదా రెండు చుక్కల నిమ్మరసం కలిపితే సరిపోతుంది. ఈ లెమన్ రైస్ ను తయారుచేయడానికి అన్నం వండేటప్పుడు దానిలో కొంచెం నిమ్మరసం, పసుపు, ఉప్పును వేసి కలపండి. దీన్ని విజిల్ లో ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వండి. తర్వాత ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపుతో పోపు పెట్టి దాంట్లో కలపండి. దీనిపైన కొంచెం నిమ్మరసం కలిపితే టేస్టీ టేస్టీ లెమన్ రైస్ రెడీ అయినట్టే. దీన్ని కొబ్బరి చట్నీ, అప్పడా లేదా వేయించిన చేపలతో తింటే బాగుంటుంది.

వెల్లుల్లి, వెన్న 

వెల్లుల్లి బటర్ రైస్ ను ఎప్పుడైనా టేస్ట్ చూసారా? చాలా బాగుంటుంది. దీనికోసం ఒక గిన్నెలో వెన్నను వేసి కరిగించండి. దీనిలో తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలపండి. ఈ రైస్ మరింత టేస్టీగా అయ్యేందుకు వెన్న, వెల్లుల్లితో పాటుగా నల్ల మిరియాలు లేదా మిరపకాయలను కూడా వేసుకోవచ్చు. ఈ రైస్ ను గ్రిల్డ్ చికెన్ లేదా స్టిర్ ఫ్రైస్ తో తింటే బాగుంటుంది. 

వేయించిన ఉల్లిపాయలు

వేయించిన ఉల్లిపాయలతో కూడా సాదా అన్నం టేస్టీగా మారుతుంది. ఇది అన్నం ఆకృతిని, రుచిని పెంచుతుంది. దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని నెయ్యి లేదా నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు బియ్యంలో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత పైన వేయించిన ఉల్లిపాయలు వేసి కలపాలి. కబాబ్ తో ఈ రైస్ ను తింటే టేస్ట్ బాగుటుంది. 

Latest Videos

click me!