మామిడి పండ్లు కెమికల్స్ లేకుండా పండాయో లేదో తెలుసుకోవడం ఎలా..?

First Published | Apr 18, 2024, 10:23 AM IST

దాదాపు ఎక్కువగా మామిడి కాయలు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది. అందుకే.. ఎక్కువగా దీనిని వాడడుతూ ఉంటారు.

ఎండాకాలం ఎండలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే.. ఇంత ఎండల్లోనూ ఊరటనిచ్చే విషయం ఏదైనా ఉంది అంటే.. అది మామిడి పండ్లే. ఎందుకంటే.. మామిడి పండ్లు మనకు  సమ్మర్ లో తప్ప.. మరే సీజన్ లోనూ దొరకవు. అందుకే.. ఈ సీజన్ లో  మామిడి పండ్లు కనపడగానే... కొనేసి.. తింటూ ఉంటాం. అయితే..  మార్కెట్లో దొరికిన అన్ని పండ్లు మన ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే.. ఈ మామిడి పండ్లలోనూ కల్తీ చేసేవారు ఉన్నారు. పచ్చి కాయలను కెమికల్స్ తో.. తొందరగా పరిపక్వత వచ్చేలా చేసి అమ్మేస్తూ ఉంటారు.
 

కానీ.. మనకు అవి సహజంగా పండాయా లేక.. కెమికల్స్ తో పండాయో తెలీదు కదా.. వెంటనే వాటిని కొనేసి తినేస్తూ ఉంటాం. కానీ అలా కెమికల్స్ వల్ల పండిన కాయలతో  ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలి అంటే.. మనం ఆ కాయ కెమికల్ ఫ్రీ అవునో కాదో కొనే ముందు గుర్తించాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 


దాదాపు ఎక్కువగా మామిడి కాయలు తొందరగా పండటానికి కాల్షియం కార్బైడ్ వాడుతూ ఉంటారు. ఇది మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది. అందుకే.. ఎక్కువగా దీనిని వాడడుతూ ఉంటారు. కానీ.. ఇలా పండిన కాయలను తినడం వల్ల.. తలనొప్పి, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు.. అలాంటి పండు నోట్లో పెట్టుకోగానే.. నోరు మండినట్లుగా అనిపిస్తుంది. కొందరికైతే కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి.

అందుకే.. ఈ సింపుల్ టెస్ట్ తో.. ఆ పండు కెమికల్స్ తో పండిందో లేదో తెలుసుకోవచ్చు. ముందుగా.. మీరు కొన్న మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో వేసి ఉంచండి. ఆ మామిడి పండు నీటిలో మునిగింది అంటే.. అది పూర్తిగా సహజంగా పండిందని అర్థం. అలా కాకుండా.. నీటిలో తేలింది అంటే.. అది  కెమికల్స్ ద్వారా పండిందని అర్థం.

ఇలా కాదు అంటే.. మీరు మామిడి పండు కలర్ ద్వారా కూడా దానిని కనిపెట్టవచ్చు. మామిడి పండు పైన భాగం.. కొద్దిగా అక్కడక్కడ పచ్చగా.. మొత్తం ఎల్లో కలర్ లో ఉంటే.. అది కెమికల్స్ ద్వారా పండిందని అర్థం. అలా కాకుండా,,.సహజంగా పండిన కాయ అయితే... యూనిఫాంగా ఆకుపచ్చ, పసుపు పచ్చ కాంబినేషన్ లో ఉంటుంది.
 

కెమికల్స్ ద్వారా పండిన కాయను కోసినప్పుడు.. పైభాగానికీ లోపలి భాగానికి సంబంధమే ఉండదు. అదే.. సహజంగా పండిన కాయ అయితే..మంచిగా పసుపు రంగులో కనపడుతుంది.

Mango

అంతేకాదు.. సహజంగా పండిన కాయ అయితే.. దాని మీద బ్రౌన్ కలర్ మచ్చలు అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా.. కెమికల్స్ ద్వారా.. పండిన కాయ అయితే.. దానిపై తెల్ల మచ్చలుు ఉంటాయి. ఇలా కూడా మనం వాటిని గుర్తించవచ్చు.

ఇక కెమికల్స్ ద్వారా పండిన కాయలు మాత్రమే కాదు.. సహజంగా పండిన కాయలు కూడా మంచిగా జ్యూసీగా ఉంటాయి. అయితే.. అందుకే.. ఈ పండ్లు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా తెలియని వారి దగ్గర పండ్లు కొనకూడదు అని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

mango

ఇక.. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను వెంటనే తినేయకూడదు.  కనీసం అరగంట పాటు నీటిలో నాన పెట్టాలి. ఆ తర్వాత.. శుభ్రం చేసి మాత్రమే తినాలి. అప్పుడు.. వేడి చేయదు, గ్రాస్టిక్ సమస్యలు.. శరీరంపై మచ్చలు రావడం లాంటివి జరగకుండా ఉంటాయి.
                               

Latest Videos

click me!