పల్లీలను మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. చాలామంది పల్లీలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొని స్టోర్ చేస్తుంటారు. కానీ అవి తొందరగా పాడై పోతుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పల్లీలు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉంటాయట. మరి ఆ చిట్కాలెంటో చూసేయండి.
పల్లికాయలను చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచివి. తక్కువ ధరకు లభిస్తాయి. చట్నీ నుంచి కూర వరకు చాలారకాల వంటల్లో పల్లీలను వాడతారు. రకరకాల స్వీట్లు కూడా చేస్తారు. వీటిలో ఉండే ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచివి.
చాలామంది వేరుశనగ త్వరగా చెడిపోదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సరిగ్గా నిల్వ చేయకపోతే పల్లీలు త్వరగా చెడిపోతాయి. అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా పల్లీలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి.
26
ఏడాది పాటు ఫ్రెష్ గా..
వేరుశనగలో నూనె, ఫ్లేవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అందుకే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండవు. కానీ బాగా నిల్వ చేస్తే ఏడాది వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
36
ఎలా స్టోర్ చేయాలి?
పల్లీలను వేడి, వెలుతురు, తేమకు దూరంగా ఉంచాలి. లేదంటే నూనె కరుగుతుంది. ఎప్పుడూ చల్లగా, పొడిగా ఉండే చోట నిల్వ చేయాలి.
46
గాజు సీసాలో
ఏదైనా ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంచుకోవాలంటే గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి. వేరుశనగ కూడా చెడిపోకుండా గాలి తగలని డబ్బాలో నిల్వ చేయండి. తేమ, వేడి నుంచి రక్షణ ఉంటే వేరుశనగ రుచిగా, ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటుంది.
56
ఫ్రిజ్‌లో పెట్టొచ్చు
పల్లీలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కానీ గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అప్పుడే అవి చెడిపోకుండా ఉంటాయి.
66
పాడైన పల్లీలను ఎలా గుర్తించాలి?
- ఫ్రెష్ వేరుశనగ తేలికగా, మంచి వాసనతో ఉంటుంది. వింత వాసన వస్తే చెడిపోయినట్లే.
- ఫ్రెష్ వేరుశనగ లేత ఎరుపు, మెరుస్తూ ఉంటుంది. మసకగా లేదా ఫంగస్ ఉన్నట్లు ఉంటే చెడిపోయినట్లే.
- వేరుశనగ రుచి చూడండి. చెడిపోయిన వేరుశనగ రుచి బాగోదు.
- వేరుశనగ ముడుచుకుపోయి, ఎండిపోయి, ఫంగస్ ఉన్నట్లు ఉంటే చెడిపోయినట్లే.