మనలో చాలా మందికి ఉదయం లేవగానే.. వేడి వేడి టీ తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక నార్మల్ టీ ఎందుకులే అని ఎక్కువ మంది అల్లం టీ తాగుతూ ఉంటారు. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
కానీ, అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే, ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తాగితే, అది శరీరంలో అనేక సమస్యలకు దారితీయవచ్చని మీకు తెలుసా? ఉదయం ఖాళీ కడుపుతో అల్లం టీ తాగడం వల్ల కలిగే సమస్యలేమిటో ఇక్కడ చూద్దాం.
కడుపు సమస్య: ప్రతిరోజూ ఉదయం ఎక్కువ అల్లం టీ తాగితే కడుపులో గ్యాస్, అతిసారం వంటి సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా ఒకసారి తాగితే పర్లేదు కానీ.. రెగ్యులర్ తాగితే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ.
జుట్టు రాలడం: ప్రతిరోజూ ఉదయం ఎక్కువ అల్లం టీ తాగితే జుట్టు రాలడం సమస్య వస్తుంది. ఎందుకంటే, దీనిలో జింజరాల్ ఉంటుంది. ఇది జుట్టుకు హానికరం.
నిద్రలేమి: ప్రతిరోజూ ఎక్కువ అల్లం టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర శరీరానికి విశ్రాంతినివ్వడానికి చాలా ముఖ్యం.
తలతిరగడం: ప్రతిరోజూ ఎక్కువ అల్లం టీ తాగడం వల్ల శరీరంలో అలసట వస్తుంది. ఇది బలహీనత , తలతిరగడానికి దారితీస్తుంది.
ఛాతిలో మంట: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ అల్లం టీ తాగితే ఛాతిలో మంట వస్తుంది. అంతేకాదు కడుపులో ఎసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది.
రక్తపోటు సమస్య: రక్తపోటు సమస్య ఉన్నవారు అల్లం టీ తాగకూడదు. అలాగే సాధారణ రక్తపోటు ఉన్నవారు కూడా అల్లం టీని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తాగితే రక్తపోటు సమస్య వస్తుంది.