white rice
మన భారతీయులు ఎక్కువగా తీసుకునేది అన్నమే. రోజుకి రెండు పూటలా అన్నమే తింటూ ఉంటాం. అయితే సడెన్ గా బరువు తగ్గాలి అంటే అన్నం మానేయాలి అంటే కష్టంగా ఉంటుంది. అందుకే.. ఒక వారం, నెల రోజులు అంటే తినకుండా ఉండగలరు. ఆ తర్వాత మళ్లీ అన్నం తినడం మొదలుపెట్టగానే… మళ్లీ బరువు పెరిగిపోతూ ఉంటారు. అలా కాకుండా…అన్నం తిన్నా కూడా బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం….
నార్మల్ అయితే అందరూ అన్నం రోజూ తింటారు. కానీ, బరువు తగ్గాలి అనుకునేవారితోనే అసలు సమస్య. అన్నంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పిండి పదార్థాల కారణంగా తింటే బరువు పెరుగుతాం అనే భయం ఉంటుంది. కానీ, వండే విధంగా వండితే బరువు ఈజీగా తగ్గొచ్చు.
రోజూ అన్నం తినే సమయంలో ఒక చిన్న ట్రిక్ ని ఫాలో అవ్వాలి. ఎప్పటిలాగానే ప్లేటు నిండా అన్నం, కొంచెం కూర కాకుండా…. మీరు తినే ప్లేట్ ని నాలుగు భాగాలుగా విభజించాలి. అందులో ఒక్క భాగం మాత్రమే అన్నం ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మూడు భాగాల్లో కూర, ప్రోటీన్, పైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇలా తింటే.. కచ్చితంగా బరువు తగ్గుతారు.
2. అన్నం తినే భోజనాన్ని ఎలా వండుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమే. సరైన వంట పద్ధతిని ఎంచుకోవాలి. మీ బియ్యాన్ని , కూరలను వేయించడానికి బదులు ఉడికించి తీసుకోవాలి. ముఖ్యంగా.. గంజి వంచి వండుకోవడం మంచి పద్దతి.
3. మీ ప్లేట్‌ను సమతుల్యం చేసుకోండి మీ అన్నాన్ని కూరగాయలు, పప్పుతో సమాన భాగాలలో కలపండి. సమతుల్య భోజనం పోషకమైనది మాత్రమే కాదు, మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది.
4. ఫైబర్, ప్రోటీన్ జోడించండి మీ బియ్యాన్ని అధిక ఫైబర్ కూరగాయలు లేదా లీన్ ప్రోటీన్‌తో కలపండి. ఈ కాంబో మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది.తర్వాత అనవసరంగా చిరుతిళ్లు తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.