జొన్న రొట్టె, సజ్జ రొట్టె.. రెండింటిలో ఏది మంచిది?

First Published | Jan 11, 2025, 4:11 PM IST

మనం మన ఆరోగ్యాన్ని పెంచే జొన్న రొట్టె, సజ్జ రొట్టె లాంటివి ప్రయత్నంచవచ్చు. మరి... ఈ  రెండింటిలో ఏది మంచిది? ముఖ్యంగా చలికాలంలో ఈ రెండింటిలో ఏ రోటీ తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం

రోటీ తినే వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అయితే.. ఎక్కువగా గోధుమ పిండితో చేసిన రోటీ మాత్రమే తింటూ ఉంటారు. అన్నం కి బదులు మనం రోటీ తింటాం. కానీ.. రోజూ రోటీ తినడం కూడా అంత మంచిదేమీ కాదు. అందరికీ గోధుమ పిండి సెట్ కాకపోవచ్చు. అందుకే.. దాని స్థానంలో మనం మన ఆరోగ్యాన్ని పెంచే జొన్న రొట్టె, సజ్జ రొట్టె లాంటివి ప్రయత్నంచవచ్చు. మరి... ఈ  రెండింటిలో ఏది మంచిది? ముఖ్యంగా చలికాలంలో ఈ రెండింటిలో ఏ రోటీ తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

నిజానికి చలికాలంలో జొన్న రొట్టె, సజ్జ రొట్టె రెండూ ఆరోగ్యానికి మంచివే. కానీ  కానీ రెండింటిలోనూ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, వాడకంలో కొన్ని తేడాలున్నాయి. చాలామంది శీతాకాలంలో ఈ రెండు రొట్టెలను తమ ఆహారంలో చేర్చుకుంటారు. పగటిపూట తేలికగా జీర్ణమయ్యే జొన్న రొట్టె తినాలి. రాత్రిపూట శరీరానికి ఎక్కువ వేడి, శక్తినిచ్చే సజ్జ రొట్టె తినాలి. ఈ రెండింటిలో ఏ రొట్టె ఎప్పుడు తినాలో చూద్దాం..


Image: Freepik

1సజ్జ రొట్టె...

పోషక విలువలు (100 గ్రాముల్లో):

కేలరీలు: 378
ప్రోటీన్: 11 గ్రాములు
ఫైబర్: 8.5 గ్రాములు
ఐరన్: 8 మిల్లీగ్రాములు
మెగ్నీషియం: 137 మిల్లీగ్రాములు

ఈ సజ్జ రొట్టె తినడం వల్ల కలిగే లాభాలు...
శక్తికి మంచిది: శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, ఎక్కువసేపు శక్తినిస్తుంది.

డయాబెటిస్‌కి మంచిది: గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఎముకలకు బలం: కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

జీర్ణక్రియ మెరుగు: ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

గుండె ఆరోగ్యం: కొలెస్ట్రాల్‌ని నియంత్రించి, గుండెకు మేలు చేస్తుంది.

2. జొన్న రొట్టె

పోషక విలువలు (100 గ్రాముల్లో):

కేలరీలు: 329
ప్రోటీన్: 10.4 గ్రాములు
ఫైబర్: 6.7 గ్రాములు
ఐరన్: 4.1 మిల్లీగ్రాములు
పొటాషియం: 363 మిల్లీగ్రాములు

టాక్సిన్స్: శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపిస్తుంది.

గ్లూటెన్ లేదు: గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి మంచిది.

బరువు తగ్గడానికి: జీర్ణక్రియ మెరుగుపరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

చర్మం, జుట్టుకి మంచిది: యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

హిమోగ్లోబిన్ పెంచుతుంది: ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది.

Latest Videos

click me!