రెస్టారెంట్ స్టైల్లో ‘చిల్లీ పన్నీర్’

First Published | Feb 11, 2021, 12:46 PM IST

మరి రెస్టారెంట్ స్టైల్ లో చిల్లీ పన్నీర్ ఎలా చేయాలో మనం ఇప్పుడు ఓసారి చూసేద్దామా...
 

నాన్ వెజిటేరియన్స్ కోసం ఎన్నికల రకాల ఫుడ్స్ ఉన్నాయో.. వెజిటేరియన్స్ కోసం కూడా అంతే రకరకాల రుచులు అందుబాటులోకి ఉన్నాయి. వెజిటేరియన్స్ చికెన్ కి బదులు ఎక్కువగా పన్నీర్ తినడానికి ఇష్టపడతారు. కాగా.. ఆ పన్నీర్ తో చిల్లీ పన్నీర్ ఇంకా రుచిగా ఉంటుంది.
undefined
మరి రెస్టారెంట్ స్టైల్ లో చిల్లీ పన్నీర్ ఎలా చేయాలో మనం ఇప్పుడు ఓసారి చూసేద్దామా...
undefined

Latest Videos


కావాల్సిన పదార్థాలు..పన్నీర్ - అరకిలో, కోడి గుడ్డు - ఒకటి, కార్న్ ఫ్లోర్ - అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను,
undefined
ల్లి తురుము - రెండు కప్పుడు, పచ్చిమిర్చి తురుము - ఒక టీస్పూను, సోయాసాస్ - ఒక టీస్పూను, వెనిగర్ - రెండు టీస్పూనులు, కొత్తి మీర తురుము - ఒక టేబుల్ స్పూను, అజినమోటో - పావు టీస్పూను, నూనె - సరిపడినంత, ఉప్పు - తగినంత
undefined
తయారీ విధానం..పన్నీర్‌ను మీకు తినడానికి వీలయ్యే సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో పన్నీర్ ముక్కలు వేసి, అందులో కోడిగుడ్డు సొన, కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త నీళ్లు వేసి కలపాలి. ఓ అరగంట పాటూ అలా వదిలేయాలి.
undefined
అనంతరం కళాయిలో నీళ్లు వేసి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని బ్రౌన్ రంగులోకి వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.
undefined
ఇప్పుడు మరో కళాయిలో రెండు టీ స్పూనుల నూనె వేసి అది వేడెక్కాక ఉల్లి తురుము, పచ్చి మిర్చి తురుము వేసి వేయించాలి. అందులోనే సోయాసాస్, వెనిగర్, అజినమోటో వేసి కలపాలి.
undefined
అందులో ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ కట్టేసి పన్నీర్ ముక్కలపై కాస్త కొత్తి మీర చల్లుకుని సర్వ్ చేయాలి.
undefined
click me!