మన ఇండియన్స్ రక రకాల ఫుడ్స్ రుచి చూడటానికి ఇష్టపడతారు. మన అభిరుచికి తగ్గట్టే రక రకాల ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి నచ్చే ఫుడ్స్ లో పరాటా కూడా ఒకటి. ఇప్పటి వరకు పరాటాలో మీరు చాలా రకాలు తినే ఉంటారు.
వాటిలో ఈ తల్వా పరాటా కూడా ఒకటి. ఇది అన్ని పరాటా ల్లో కెల్లా కాస్త భిన్నంగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సులువు. మరి ఈ పరాటా కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనమూ ఓసారి చూసేద్దామా..
పరాటాలు చేసుకోవడానికి ముందు.. పరాటాలోపల పెట్టుకునే మసాలాను తయారు చేసుకోవడం ముఖం. ఇప్పుడు ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
ముందుగా.. మైదా కానీ గోధుమ పిండి, కొంచెం కారం, ఉప్పు కలిపి.. పిండిలో కొద్దిగా నెయ్యి, తర్వాత నీరు కలిపి చపాతీలు చేసుకోవడానికి వీలుగా పిండి ముద్దలా కలుపుకోవాలి.
తర్వాత ఒక ప్యాన్ లో పచ్చి బఠానీలు, ఉప్పు జీరా, కారం వేసి ఉడికించుకోవాలి. తర్వాత దానిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా కొద్దిగా తీసుకొని.. చపాతి పిండిలో పెట్టుకొని పరాటాలుగా చేసుకోవాలి.
తర్వాత నెయ్యితో వీటిని రెండు వైపులా తవా మీద కాల్చుకోవాలి.
అంతే.. రుచి కరమైన పరాటా రెడీ.. వీటిని వేడి మీద తింటే చాలా రుచిగా ఉంటాయి.
కాగా.. సజ్జలతో కూడా పరాటా చేసుకోవచ్చు.. దాని తయారీ విధానం కూడా ఇప్పుడు చూద్దాం..
కావాల్సినవి:సజ్జ పిండి: రెండు కప్పులు, గోధుమపిండి: అర కప్పు, ఉడికించి చిదిమిన ఆలుగడ్డ: ఒక కప్పు, మెంతికూర లేదా కొత్తిమీర: అర కప్పు, పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్, కారం: అర టీ స్పూన్, పసుపు: పావు టీ స్పూన్, అల్లం తరుగు: ఒక టీ స్పూన్, జీలకర్ర: ఒక టీ స్పూన్, వాము: పావు టీ స్పూన్, చాట్ మసాలా: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా
తయారీఒక పెద్ద గిన్నెలో సజ్జ పిండి, గోధుమ పిండి, ఆలుగడ్డ ముద్ద, మెంతికూర లేదా కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం తరుగు, జీలకర్ర, వాము, చాట్ మసాలా వేసి కలపాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా కలిపి పావుగంటసేపు పక్కనపెట్టాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని కాస్తంత మందంగా వత్తాలి. ఇలా పిండి మొత్తాన్నీ చేసుకున్నాక, ఒక్కో పరాటాను పెనంపై నూనె చల్లుతూ రెండువైపులా కాల్చాలి. ఈ సజ్జ ఆలూ పరాటాలను చట్నీతో నంజుకుని తింటే టేస్టీగా ఉంటాయి.