ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టపడేవారందరికీ బర్గర్ ఆల్ టైమ్ ఫేవరేట్. అసలు బర్గర్ పేరు చెబితేనే చాలా మందికి నోరూరిపోతుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని విపరీతంగా లాగించేస్తారు.
కాగా.. మీరు కూడా చాలా రకాల బర్గర్లు రుచి చూసి ఉంటారు, చికెన్, వెజ్ లలో చాలా రకాల టేస్టుల్లో ఈ బర్గర్లు అందుబాటులో ఉన్నాయి. కాగా.. తాజాగా.. ఓ కొత్త రకం బర్గర్లు ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అవేంటో తెలుగా.. ‘గే బర్గర్లు’.
గే బర్గర్ రెస్టారెంట్స్ ప్రత్యేకంగా గే బర్గర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈ బర్గర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో చిన్నాపాటి చర్చలే జరుగుతున్నాయి.
మన సమాజంలో స్త్రీ, పురుషులకు ఇచ్చే గౌరవడం థర్డ్ జెండర్ కి ఉందడు. ఇలాంటి క్రమంలోనే ప్రత్యేకంగా వారి కోసం గే బర్గర్లు తీసుకురావడం ఆసక్తి రేపుతోంది.
ప్రముఖ యూట్యూబర్ ఎలిజా డేనియల్ దీనికి శ్రీకారం చుట్టాడు. చాలా బ్రాంచ్ లు కూడా తెరిచాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఈ బర్గర్స్ తినడానికి ‘గే’ లు ఆసక్తి చూపిస్తున్నారు. వెళ్లి బర్గర్స్ తిన్నవారి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
గతంలో డేనియల్ LGBTQIA+ పేరి ట హ్యాంబర్గర్స్ అందించి అందరి మనసులు గెలుచుకున్నాడు. కాగా.. తాజాగా గే బర్గర్లు పరిచయం చేశాడు. వీటి ద్వారా వచ్చిన డబ్బులను ఎల్జీబీటీ సెంటర్లకు విరాళంగా ఇవ్వడం విశేషం.