ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై.. ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే..

First Published | Feb 29, 2024, 12:25 PM IST

చికెన్ ను తినని వారు ఎవరూ ఉండరు. చికెన్ ఫ్రైట్, చికెన్ 65, చికెన్ కర్రీ అంటూ రకరకాలుగా చేసుకుని తింటారు. అయితే ఈ సారి డిఫరెంట్ గా ఆంధ్రా స్టైల్ లో చికెన్ ఫ్రైను తయారుచేయండి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. 
 

ఆదివారాల్లో చాలా మంది చికెన్ ను ఖచ్చితంగా చేసుకుని తింటారు. కానీ ఎప్పుడూ ఒకేలా అంటే బోర్ కొడుతుంది. సరిగ్గా తినాలనిపించదు. అందుకే ఈ సారి చికెన్ ను మరింత టేస్టీగా వండటానికి ట్రై చేయండి. మనం ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీలా కాకుండా.. ఈ  సారి ఆంధ్రా స్టైల్ లో చికెన్ ఫ్రై ని తయారుచేయండి. ఇది స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు

కిలో చికెన్, తగినంత ఉప్పు,  పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, మిరియాలు, యాలకులు, సోంపు,  లవంగాలు,  ఎండు మిరపకాయలు, నువ్వుల నూనె, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. 

Latest Videos


ఎలా తయారుచేయాలంటే? 

1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కేజీ చికెన్ వేసి.. దానిలో 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 4 టీస్పూన్ల కారం వేసి బాగా కలపండి. దీన్నిఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. 
 

2. ఇప్పుడు ఒక బాణలిలో స్టవ్ పై పెట్టి తీసుకుని నూనె వేయకుండా రెండున్నర చెంచాల ధనియాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా సోంపు గింజలు, ఒక చెంచా మిరియాలు, మూడు యాలకులు, నాలుగు లవంగాలు, రెండు చిన్న చిన్న దాల్చినచెక్క ముక్కలు, పది ఎండుమిర్చి వేసి  వేయించండి. వేగిన తర్వాత కాసేపు చల్లారనివ్వండి. తర్వాత  అన్నింటినీ మిక్సీలో వేసి నీళ్లు లేకుండా గ్రైండ్ చేసి పౌడర్ లా తయారుచేయండి. 

3. తర్వాత బాణలిలో ఆరు చెంచాల రిఫైన్డ్ ఆయిల్ వేడి వేడవ్వనివ్వండి. దీంట్లో నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించండి. ఉల్లిపాయల ముక్కలు బంగారు రంగులోకి మారిన తర్వాత కొన్ని కరివేపాకులు, పక్కన పెట్టిన చికెన్ ను వేయండి. ఆ తర్వాత రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపండి. ఐదు నిమిషాల తర్వాత చికెన్ లో నాలుగు చెంచాల గ్రైండ్ చేసిన మసాలా వేసి కలపండి. 
 

4. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ లో మిగిలిన మసాలా, ఉప్పు వేయండి. ఇప్పుడు మంట తగ్గించి చికెన్ ను 15 నిమిషాల పాటు వేయించండి. అంతే.. వేడివేడి ఆంధ్రా స్టైల్ చికెన్ ఫ్రై తయారైనట్టే. చివరగా కొత్తిమీర వేసి తింటే రుచి అదిరిపోతుంది. 

click me!